ఉదయం లేవగానే చాలామంది టీ లేదా పాలలో బిస్కట్ తింటారు. మన వద్ద పార్లేజీ, టైగర్ బిస్కట్ చాలా ఫేమస్. కరోనా సమయంలో ఈ బిస్కట్ ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ క్వాంటిటీ తగ్గింది. ఇటీవలే బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలను నాలుగు శాతం మేర పెంచింది. తాజాగా పార్లేజీ కూడా తమ ఉత్పత్తులపై 5 శాతం నుండి 10 శాతం మేర పెంచనుంది. అన్ని రకాల ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్ల ధరలు పెంచవలసి వచ్చిందని, ముఖ్యంగా ముడి సరుకులు చక్కెర, గోధుమ, వంటనూనెల ధరలు పెరిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నిర్ణయంతో పార్లే-జీ, హైడ్ అండ్ సీక్, క్రాక్-జాక్ ధరలు 5 శాతం నుండి 10 శాతం వరకు పెంచుతున్నామని, రస్క్, కేక్ 7 శాతం నుండి 8 శాతం వరకు, మోస్ట్ పాపులర్ గ్లూకోజ్ బిస్కట్ 6 శాతం నుండి 7 శాతం వరకు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక, రూ.10, రూ.20, రూ.30 ధరలు కలిగిన బిస్కట్ ప్యాకెట్ ధరలు పెంచడం లేదు. కానీ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పార్లేజీ బిస్కట్ కంపెనీ ధరలు పెంచడం ఇది మొదటిసారి. అంతకుముందు జనవరి-మార్చి త్రైమాసికంలో ధరలు పెంచింది. గత ఏడాది కాలంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు 50 శాతం నుండి 60 శాతం పెరిగాయని, అలాగే చక్కెర ధరలు ఎనిమిది శాతం నుండి పది శాతం పెరిగాయని, గత ఏడాదితో పోలిస్తే ధరలు ఈ మేరకు పెరగడంతో తాము ధరలు పెంచవలసి వస్తుందని చెప్పారు. అలాగే, రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని తెలిపింది. అంతకుముందు గత నెలలో బ్రిటానియా ఇండస్ట్రీస్ ధరలు పెంచింది.


Click it and Unblock the Notifications