నిన్న మ్యాగీ నేడు బిస్కెట్లు.. పిల్లల ఫెవరెట్ పార్లే-జీ ధరల పెంపు..
ఈ ఏడాది ముగుస్తున్న సమయంలో నిత్యావసర వస్తువులలో పిల్లలకి ఇష్టమైన ఆహార పదార్ధాల కంపెనీలు షాకిస్తున్నాయి. తాజాగా నెస్లే కంపెనీ మ్యాగీ ధరలను కొత్త ఏడాది నుండి పెంచుతున్నట్లు ప్రకటించాక ఇదే దారిలో ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ క్యూ కట్టింది. ప్రముఖ FMCG కంపెనీ పార్లే ప్రొడక్ట్స్ అన్ని ఉత్పత్తుల ధరలను జనవరి 2025 నుండి 5% పెంచాలని యోచిస్తోంది. పార్లే బిస్కెట్లు, బ్రెడ్, కేకులు ఇతర స్నాక్స్ కి కూడా ధరల పెంపు వర్తిస్తుందని తెలిపారు. పార్లే-జి బిస్కెట్లు తరతరాలుగా పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్. స్కూల్‌కి వెళ్లేటప్పుడు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి టీ తాగేటప్పుడు బార్లీ-జి బిస్కెట్‌ల గురించి ఇప్పటికీ చాలా మందికి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ధరల పెంపుతో పాటు పార్లే జి ఉత్పత్తుల బరువు కూడా తగ్గించాలని కూడా యోచిస్తోంది. అంటే రూ.5, రూ.10 ప్యాకెట్ల పార్లే-జీ బిస్కెట్ల బరువు 5 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది.
ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఈ చర్య తీసుకుంది. గోధుమ పిండి, చక్కెర, కోకో పౌడర్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు పామాయిల్‌పై దిగుమతి సుంకం కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచింది. పామాయిల్ ధరలు దాదాపు 45 శాతం పెరిగాయి. తయారీదారులు ఎదుర్కొంటున్న ఖర్చు భారాన్ని నివారించడానికి ఈ చర్య తీసుకుంది. ఎఫ్‌ఎంసిజి ఇండస్ట్రీ లీడర్ బ్రిటానియా కూడా తాజాగా ఇలాంటి ప్రకటన చేసింది. దీని తర్వాత పార్లే-జీ కూడా ఈ ప్రకటన చేసింది. గత త్రైమాసికంలో బ్రిటానియా ఉత్పత్తులపై ధరల పెంపును ప్రకటించింది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలను కవర్ చేయడానికి కంపెనీలు ఈ చర్యలను అమలు చేస్తున్నాయి. సాధారణంగా, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL), గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL), మారికో, ITC, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL) వంటి ప్రముఖ FMCG కంపెనీలు డైలీ వినియోగ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

ఈ FMCG కంపెనీలు టీ, బిస్కెట్లు, టూత్‌పేస్ట్, సబ్బు, సబ్బు పొడి వంటి లెక్కలేనన్ని ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తాయి. కాబట్టి ఇలాంటి కంపెనీలు ధరల పెంపును ప్రకటించినప్పుడు, అది సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న ముడిసరుకు ధరల కారణంగా మొత్తం ఎఫ్‌ఎంసిజి రంగం ఉత్పత్తుల ధరలను పెంచుతోంది. దీని వల్ల రానున్న నెలల్లో నిత్యవసర వస్తువులపై వినియోగదారులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications