స్టాక్ మార్కెట్లోకి పార్క్ హాస్పిటల్స్: ఇన్వెస్టర్లకు మంచి ఛాన్స్ ! కొత్త లిస్టింగ్ ఎప్పుడంటే?

పార్క్ మెడి వరల్డ్ IPO: భారతదేశంలోని ప్రముఖ హాస్పిటల్ చైన్లలో ఒకటైన పార్క్ మెడి వరల్డ్ రూ.1,260 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి అప్లయ్ చేసింది. అయితే ఈ IPO కంపెనీని విస్తరించడానికి ఇంకా ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.

Park Medi World is taking steps towards its IPO with application now before SEBI

IPO వివరాలు: సెబీకి ఫైల్ చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం, ఈ IPOలో రూ. 900 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేయబడతాయి. ప్రమోటర్ అజిత్ గుప్తా నిర్వహించే ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద రూ.300 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు. అదనంగా, కంపెనీ రూ. 192 కోట్ల వరకు ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్‌ పరిగణించవచ్చు.

IPO ద్వారా సేకరించిన ఫండ్స్ ఎం చేస్తుందంటే :ఈ ipo నుండి సేకరించిన ఫండ్స్ వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పార్క్ మెడి వరల్డ్ యోచిస్తోంది. వీటిలో లోన్ తిరిగి చెల్లించడానికి రూ.410 కోట్లు ఉపయోగించనుంది. ఇంకా కొత్త హాస్పిటల్స్ అభివృద్ధి అండ్ ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ విస్తరణ కోసం 110 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. అలాగే 77.19 కోట్లతో వైద్య పరికరాలను కొనుగోలు చేయనుంది. మిగిలిన నిధులను కొత్త ప్లాన్స్ ఇంకా సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.

పార్క్ మెడి వరల్డ్ నార్త్ ఇండియాలోని ప్రముఖ హాస్పిటల్ చైన్: CRISIL నివేదిక ప్రకారం, పార్క్ మెడి వరల్డ్ నార్త్ ఇండియాలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చైన్. ఈ కంపెనీ ప్రస్తుతం 13 మల్టీ-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. దీని ఆసుపత్రులు ఢిల్లీ, హర్యానా (అంబాల, గురుగ్రామ్, కర్నాల్, పానిపట్, పాలం విహార్, సోనిపట్, ఫరీదాబాద్), రాజస్థాన్ (జైపూర్, బెహ్రోర్) ఇంకా పంజాబ్ (పాటియాలా, మొహాలి)లో ఉన్నాయి.

పెట్టుబడిదారులకు మంచి ఛాన్స్ : ఈ IPO ద్వారా ఫండ్స్ సేకరించడంతో పాటు పార్క్ మెడి వరల్డ్ హాస్పిటల్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని అలాగే ఆర్థికంగా బలాన్ని పొందాలని యోచిస్తోంది. కరోనా తరువాత భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుతుండటంతో ఈ IPO పెట్టుబడిదారులకు మంచి అవకాశం కావచ్చు.పార్క్ హాస్పిటల్ 13 NABH గుర్తింపు పొందిన మల్టీ-సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది, వీటిలో ఏడు హాస్పిటల్స్ కూడా NABL గుర్తింపు పొందాయి, ఈ హాస్పిటల్స్ 891 మంది వైద్యులు, 1,912 మంది నర్సుల బృందంతో పనిచేస్తుంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+