IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. అడుగుపెట్టగానే కొనుగోళ్ల రచ్చ, 5% అప్పర్ సర్క్యూట్..

Paramount Speciality Forgings IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలాఖరులోనూ ఐపీవోల కోలాహలం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నెల చివరి వారంలో ఐపీవోలు లాభాల సునామీతో ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచేస్తున్నాయి. ప్రధానంగా ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవోలు పెట్టుబడిదారులను రోజుల్లోనే ధనవంతులుగా మార్చేస్తున్నాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పారామౌంట్ స్పెషాలిటీ ఫోర్జింగ్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో బలమైన అరంగేట్రాన్ని చూశాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఒక్కోటి ఇష్యూ ధర కంటే 40.6 శాతం ప్రీమియం రేటు రూ.83 వద్ద లిస్ట్ చేయబడ్డాయి. అయితే లిస్టింగ్ తర్వాత సైతం కంపెనీ షేర్లను దక్కించుకునేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ కనిపించింది. దీంతో కొనగోళ్లు కంపెనీ షేర్లను 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకేలా చేశాయి. ఇది ఇంట్రాడేలో కంపెనీ షేర్లను గరిష్ఠంగా రూ.87.15 ధరకు చేరుకునేలా చేశాయి. ప్రస్తుతం క్రేజీ ఐపీవో షేర్లను అమ్మటానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటం లేదని ట్రేడింగ్ డేటా చెబుతోంది.

Paramount Speciality Forgings IPO locked in 5percent upper circuit after bumper listing

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.32.34 కోట్లను సమీకరించింది. ఇదే క్రమంలో కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద 6.8 లక్షల షేర్లను విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఆఫర్ ఓపెన్ చేసి ఉంచింది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.57-59గా ప్రకటించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1.18 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఐపీవో నాలుగు రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో 74 సార్లు సభ్యత్వం పొందింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 220 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 41 రెట్లు, QIBలకు కేటాయించిన కోటా 20 రెట్లు ఎక్కువ సభ్యత్వాన్ని పొందాయి.

1994లో కంపెనీ విలీనం చేయబడింది. కంపెనీ ఉక్కు ఫోర్జింగ్‌ల తయారీదారు. వీటి ఉత్పత్తులు పెట్రోకెమికల్, కెమికల్స్, ఎరువులు, ఆయిల్ అండ్ గ్యాస్, న్యూక్లియర్ ఎనర్జీ, హెవీ ఇంజినీరింగ్ రంగాలతో సహా వివిధ పారిశ్రామిక అనువర్తనాల్లో ఉపయోగించబడుతుంది. పారామౌంట్ మహారాష్ట్రలోని కమోతే, ఖలాపూర్‌లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని ఖోపోలి ప్లాంట్‌లో విస్తరణకు తోడ్పడే యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేయడానికి కొంత భాగాన్ని వినియోగించాలని నిర్ణయించింది. అలాగే మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు, ఇతర నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+