Paramesu Biotech IPO: నవంబర్ మాసంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోల రద్దీ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఏడాది చివరికి వస్తున్న వేళ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేస్తున్నాయి. గతంలో కంటే ఈ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్టింగ్ జోష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదని ఇటీవల ముగిసిన స్విగ్గీ ఐపీవో కూడా నిరూపించింది.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లో ఐపీవో ఫ్లోట్ చేసేందుకు సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్న పరమేసు బయోటెక్ కంపెనీ గురించే. సెబీ నుంచి ఆమోదం కోసం వెయిట్ చేస్తున్న కంపెనీ మొక్కజొన్న ఉత్పత్తుల తయారీలో ఉంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.600 కోట్లను సమీకరించాలని చూస్తోంది. అయితే ఇందులో రూ.520 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన రూ.80 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద కంపెనీ విక్రయించాలని చూస్తోంది. పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఏకైక బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్.

కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన సమీకరించే డబ్బుతో రూ.330 కోట్లను మధ్యప్రదేశ్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ రోజుకు 1200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయబడనుంది. అలాగే ఇదే క్రమంలో ఐపీవో ద్వారా వచ్చిన సొమ్ములో రూ.85 కోట్లను కంపెనీ తన రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించాలని చూస్తోంది. వాస్తనికి 2011లో స్థాపించబడిన పరమేసు బయోటెక్ దేశంలో మొక్కజొన్న ఆధారిత ప్రత్యేక ఉత్పత్తుల తయారీలో అతిపెద్ద ఆటగాడిగా కొనసాగుతోంది.
కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో దేశీ మొక్కజొన్న స్టార్చ్, మార్పులు చేసిన మొక్కజొన్న స్టార్చ్, లిక్విడ్ గ్లూకోజ్, మాల్టోడెక్స్‌ట్రిన్ పౌడర్, గ్లూటెన్, ఫైబర్, కార్న్ వంటివి ఉన్నాయి. కంపెనీకి ఆంద్రప్రదేశ్‌లోని దేవరపల్లి వద్ద ఉన్న ప్లాంట్ నుంచి ఈ ఉత్పత్తులను తయారు చేస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు 14 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాటు ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యంలోని 10 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయించబడుతున్నాయి. కంపెనీ ఎండీగా స్వరూప్ అద్వానీ ఉండగా మణి శ్వేత తేతాలి మొత్తం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.628 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా ఇదే కాలానికి లాభం రూ.40 కోట్లుగా ఉంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications