Parag Parikh Flexi Cap Fund: గడచిన కొన్ని త్రైమాసికాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కంటే పెట్టుబడిదారులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ పై మనసు పారేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కొన్ని వారాలుగా మార్కెట్ల ఒడిదొడుకులు, కరెక్షన్ సమయంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో పెట్టుబడులను నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. నెగటివ్ రిటర్న్స్ రావటమే చాలా మందిని నిరుత్సాహపరుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
కొన్నాళ్ల కిందట పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం భారీ కరెక్షన్ కారణంగా పెట్టుబడిదారులకు నిరాశాజనకమైన రాబడులను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది నిపుణులు ఈ సమయంలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వైపు మళ్లాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ కేటగిరీ ఫండ్స్ లో ఉన్న డైనమిక్ అప్రోచ్ కారణంగా చాలా మంది దీనికి సానుకూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు డబ్బును లార్జ్, స్మాల్, మిడ్ కేటగిరీ కంపెనీల్లోకి అవసరాలకు అనుగుణంగా మారుస్తుంటారు.

దీర్ఘకాలంలో పెట్టుబడి ద్వారా మంచి కార్పస్ నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకునే వ్యక్తులకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మంచి రాబడులను అందించటంలో దోహదపడతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఏకైక ఫండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నిలిచింది. ఈ ఫండ్ పెట్టుబడిదారులకు నెగటివ్ మార్కెట్లలో కూడా పాజిటివ్ రాబడులను అందించి ప్రత్యేకతను చాటుకుంది. జనవరి చివరినాటికి ఈ ఫండ్ కింద ఏకంగా రూ.83,703 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండటంతో దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
మే 28, 2013న ప్రారంభించబడిన పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వివిధ కాలాల్లో దాని బెంచ్‌మార్క్, కేటగిరీ సగటును స్థిరంగా అధిగమించింది. గత దశాబ్ద కాలంలో స్కీమ్ తన పెట్టుబడిదారులకు 17.19% రాబడిని అందించింది. ఈ కాలంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 500 టిఆర్ఐ రాబడి కేవలం 12.33 శాతంగా ఉంది. అలాగే ఇదే కేటగిరీలోని ఇతర స్కీమ్స్ తన ఇన్వెస్టర్లకు 12.23 శాతం రాబడిని మాత్రమే అదించగలిగాయి. గత 5 సంవత్సరాల్లో ఈ స్కీమ్ రాబడి పరంగా దాని బెంచ్‌మార్క్, కేటగిరీ సగటును అధిగమించింది. వరుసగా 16.97%, 12.23%తో పోలిస్తే 22.86% రాబడిని అందించింది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 3 సంవత్సరాల్లో బలమైన పనితీరును కనబరిచి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications