Hyderabad: పెద్ద మనసు చాటుకున్న ప్యారడైజ్ బిర్యానీ.. వినూత్నంగా బాలల దినోత్సవ వేడుక..
Paradise Biryani: సికింద్రాబాద్‌లోని 'మంచికలలు' ఆర్గనైజేషన్‌లో అనాథలు, బీద వర్గాలకు చెందిన చిన్నారులతో బాలల దినోత్సవాన్ని జరుపుకుని పారడైజ్ బిర్యానీ ప్రత్యేకంగా నిలిచింది. ప్యారడైజ్ బిర్యానీ 48 మంది పిల్లలకు బిర్యానీ & కుకీలను అందించింది.
హైదరాబాదీ బిర్యానీ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు. వాస్తవానికి ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావటం, ఒక ప్రత్యేకతపై స్నేహాన్ని పంచుకోవడంకు నిదర్శంగానూ నిలుస్తోంది. ఈ కార్యక్రమం పిల్లలను, ప్యారడైజ్‌లోని మేనేజ్‌మెంట్‌ను మరింత దగ్గర చేసింది. పారడైజ్ బిర్యానీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా దీనిని చేపట్టింది.

ఈ సందర్భంగా గౌతమ్ గుప్తా, సీఈవో - ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ.. "మేము ఈ అందమైన పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపాలని కోరుకున్నాము. వీరు కూడా గొప్ప విందు, సరదా సమయాలకు అర్హులు. ఆహారం ద్వారా ప్రజలను ఏకం చేసే పేరు ప్యారడైజ్ బిర్యానీ. ఇక్కడ మనం బంధం, తృప్తి వంటివి ఒకే చోట కలిసి రావడం చూడగలము. తాము ప్రేమించబడటం పిల్లలకు చాలా సంతోషాన్ని కలిగించింది" అని అన్నారు.

దినేష్ విజయవర్గియే చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్- ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ.. "ఇది కేవలం కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాల్లో ఒకటిగా మాత్రమే కాదు. పిల్లలను సంతోషంగా చూడటం మాకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి మేము చాలా ఆసక్తిగా దీనిని చేస్తుంటాము. ఈ వేడుక ముగించుకుని మేము ఇంటికి వచ్చినప్పుడు పొందే మానసిక ఆనందం వెలకట్టలేనిదని మేము భావిస్తున్నాము " అని అన్నారు.


Click it and Unblock the Notifications