Paradeep parivahan IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు పతనంలో ఉండటంతో అనేక కంపెనీలు తమ ఐపీవో ఫ్లోటింగ్ ప్లాన్లను ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నాయి. ప్రస్తుతం తరుణంలో మార్కెట్లలోకి అడుగుపెట్టడం వల్ల అనుకున్న స్థాయిలో ఇన్వెస్టర్ల నుంచి స్పందన కనిపించకపోవచ్చని కంపెనీలు భావించటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లోకి రాబోతున్న ఎస్ఎమ్ఈ ఐపీవో పరదీప్ పరివాహన్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి కంపెనీ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ సర్వీస్ అందించే వ్యాపారంలో కొనసాగుతోంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.45 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. సాధారణ పెట్టుబడిదారులకు మార్చి 17 నుంచి మార్చి 19 వరకు అందుబాటులో ఉండనుంది. దీనికోసం కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.93-98గా ప్రకటించింది.

ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో లాట్ పరిమాణాన్ని 1,200 షేర్లుగా ప్రకటించింది. దీంతో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో పెట్టుబడిపెట్టడానికి కనీసం రూ.1,17,600 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఐపీవోలో షేర్ల కేటాయింపు ఈనెల 20న జరగనుందని తెలుస్తోంది. అలాగే కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్చి 24న అరంగేట్రం జరగవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఐపీవోలో 45.78 లక్షల షేర్లను జారీ చేయాలని ప్లాన్ చేసింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ ఖర్చుల కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఆవిష్కరణలలో పెట్టుబడితో పాటు సేవలను విస్తరించటానికి ఉపయోగించాలని నిర్ణయించింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవోలో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లలో షేర్లు పొందని వ్యక్తులకు సొమ్ము వాపసు మార్చి 21న ఉండొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి 2000 సంవత్సరంలో స్థాపించబడిన కంపెనీ ఒడిశా కేంద్రంగా పనిచేస్తోంది. కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, పోర్ట్ కార్యకలాపాలు, ఇంటర్-పోర్ట్ రవాణా, దిగుమతి కార్గో నిర్వహణ మొదలైన సేవలను అందిస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.211 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications