జపాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ పానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో తన గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇక్కడ సుమారు రూ.650 కోట్ల పెట్టుహడితో మే నెలలో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను 12 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలో ఇది ఎనిమిదో ప్లాంట్.

1800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం
భారత్‌లో ఉత్పత్తులు పెంచాలని, తద్వారా ఎగుమతుల కేంద్రంగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ ప్లాంట్ కారణంగా 1,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్మాణ రంగంలో వినియోగించే విద్యుత్ పరికరాలను ఉత్పత్తి చేసే ఈ పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ శ్రీసిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఉత్పత్తి ప్లాంట్ కోసం ఇప్పటికే 35 ఎకరాల భూమిని సేకరించింది.

ఇప్పటికే రూ.450 కోట్ల పెట్టుబడి
శ్రీసిటీలో ఏర్పాటు చేయబోతున్న ప్లాంటుపై ఇప్పటికే రూ.450 కోట్లు పెట్టుబడులు పెట్టారు. నిర్మాణ పనులు మే 21న ప్రారంభమవుతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ శర్మ తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. యంత్రాలు, ఇతర అవసరాల కోసం మరో రూ.200 కోట్లు అవసరమన్నారు.

మూడేళ్లలో రూ.2000 కోట్ల ఆదాయం
శ్రీసిటీ ప్లాంట్ నుండి వైరింగ్ పరికరాలు, ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ గేర్లు, గాలి శుద్ధి పరికరాలను ఉత్పత్తి చేస్తామన్నారు. దాదాపు 1800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం 12 ఎకరాల్లో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, మిగతా భూమిని విస్తరణకు లేదా సోలార్ యూనిట్లకు ఉపయోగిస్తామన్నారు. ఉత్పత్తి ప్రారంభమైన మూడేళ్లలో రూ.2,000 కోట్ల ఆదాయాన్ని ఇక్కడి నుండి ఆశిస్తున్నట్లు తెలిపారు.

2022 నాటికి 130 స్టోర్స్
కాగా, మంగళవారం హైదరాబాదులో తొలి పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ప్రత్యేక ప్రదర్శన, ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది యాంకర్ పేరుతో విద్యుత్ పరికరాలను విక్రయిస్తోంది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. 2022ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 130 స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications