ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక చిన్న కిరాణా వ్యాపారికి రూ. 141 కోట్లకు పైగా అమ్మకాలకు సంబంధించి Tax Notice రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.పోలీసులు ఇన్విస్టిగేషన్ లో ఆ తరువాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దుకాణదారుడి పేరు సుధీర్.ఆ వ్యాపారి ఖుర్జాలోని నాయగంజ్ ప్రాంతంలోని తన ఇంట్లో నుండి ఒక చిన్న కిరాణా షాపు నడుపుతున్నాడు. అయితే అతని పాన్ కార్డును ఉపయోగించి కొందరు కోట్ల లావాదేవాలు చేశారు. అతని పాన్ కార్డును దుర్వినియోగం చేయడం ద్వారా ఢిల్లీలో ఆరు నకిలీ కంపెనీలు సృష్టించారు.
అయితే ఈ వ్యాపారికి ఇది మొదటి అనుభవం కాకపోవడం ఆశ్చర్యపరిచే అంశం. 2022 సంవత్సరంలో కూడా అతనికి ఇలాంటి నోటీసే వచ్చింది. ఆ సమయంలో ఈ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదాయపు పన్ను శాఖకు ఈ వ్యాపారి స్పష్టంగా చెప్పాడు. అయితే అది జరిగిన కొద్ది రోజులకు ఈ సంవత్సరం జూలై 10న అతనికి మళ్ళీ కొత్త నోటీసు వచ్చింది. ఈ నోటీసులో తన పేరు మీద రూ.1,41,38,47,126 విలువైన అమ్మకాలు జరిగాయని ఆ నోటీసుల్లో ఉంది.
ఇంత పెద్ద మొత్తం విని సుధీర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ కేసులో పోలీసులు కూడా చర్యలు ప్రారంభించారు. ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం దర్యాప్తులో ఉందని అధికారులు చెబుతున్నారు. సుధీర్ పాన్ కార్డు ఎలా దుర్వినియోగం చేయబడిందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

అసలు పాన్ కార్డ్ మోసం అంటే ఏమిటి? మీ పాన్ కార్డు సమాచారాన్ని వేరొకరు దుర్వినియోగం చేసినప్పుడు ఈ పాన్ కార్డు మోసం వెలుగులోకి వస్తుంది. ఇందులో అనేక రకాల మోసాలు ఉండవచ్చు. అందులో ఎవరైనా మీ పాన్ కార్డును ఉపయోగించి బ్యాంకు ఖాతాను తెరవవచ్చు, అలాగే నకిలీ కంపెనీలను సృష్టించవచ్చు లేదా రుణం తీసుకోవచ్చు ఇంకా పన్నులను ఎగవేయవచ్చు. చాలా మందికి అకస్మాత్తుగా పన్ను నోటీసులు లేదా లోన్ రికవరీ కోసం పిలుపు వచ్చినప్పుడే ఈ ఫ్రాడ్ గురించి తెలుస్తుంది.
భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇది దుర్వినియోగం అయితే అతను అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తప్పుడు పన్ను నోటీసులు రావచ్చు. మీ క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితమవుతుంది. దీనితో పాటు, మీరు ప్రభుత్వ దర్యాప్తును కూడా ఎదుర్కోవలసి రావచ్చు.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ పాన్ కార్డును సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి. మీ పేరు మీద ఏదైనా తెలియని లోన్ లేదా ఖాతా తెరవబడిందో లేదో ఇది తెలియజేస్తుంది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయండి. ఇది మోసం జరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. పాన్ కార్డ్ ఫోటోకాపీని షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరం లేకపోతే, పాన్ నంబర్‌లోని కొన్ని అంకెలను దాచండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications