నేటి రోజుల్లో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామందికి అప్పు అంటేనే చాలా భయపడుతుంటారు. అలాంటిది వారు రుణం తీసుకోకపోయినా వారి పేరు మీద రుణం తీసుకున్నారని తెలిస్తే గుండెలు బాదుకుంటారు. పాన్ కార్డు వివరాలు బయటకు రావడం వల్ల చాలామంది ఇతరుల పాన్ కార్డును వాడి లోన్లు తీసుకుంటున్నారు.
పాన్ కార్డ్ దుర్వినియోగం వల్ల మీ పేరుతో లోన్‌లు తీసుకుంటే ఎలా గుర్తించాలో చాలామందికి తెలియడం లేదు. మీ పేరు మీద ఎవరైనా లోన్ తీసుకుని ఉంటే అది క్రెడిట్ స్కోర్ మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో లోన్ పొందాలంటే మీకు చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మీ పాన్ కార్డ్ సురక్షితంగా వాడటం చాలా ముఖ్యం. అలాగే దాని మీద ఎవరైనా లోన్ తీసుకున్నారా లేదా అని తరచుగా చెక్ చేయడం చాలా ముఖ్యం. మరి ఎలా చెక్ చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
సాధారణంగా మీ PAN మీ క్రెడిట్ రిపోర్ట్ కు లింకై ఉంటుంది.మీ అనుమతి లేకుండా ఎవరైనా రుణం తీసుకుని ఉంటే ఆ వివరాలు అందులో కనిపిస్తాయి. ఆ క్రెడిట్ కార్డు ఖాతా, లేదా హార్డ్ ఇన్క్వైరీ మీ క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది. CIBIL, Experian, Equifax, CRIF High Mark వంటి క్రెడిట్ బ్యూరోల్లో మీ పేరుతో తీసుకున్న అన్ని లోన్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు రికార్డు చేస్తాయి. వీటిల్లో తనిఖీ చేయడం ద్వారా మీ పాన్ కార్డు మీద ఏవైనా లోన్లు ఉంటే ఈజీగా తెలుస్తాయి.

ఈ వెబ్‌సైట్లు సందర్శించడం ద్వారా మీ పాన్ నంబర్ ను మొబైల్ OTP ద్వారా ఆథెంటికేట్ చేసి ప్రతి ఏడాది ఒక ఉచిత క్రెడిట్ రిపోర్ట్ మీరు పొందవచ్చు. అందులో మీకు తెలియకుండా లోన్లు ఎవరైనా తీసుకుని ఉంటే కనిపిస్తాయి. మీరు చూసే క్రెడిట్ రిపోర్టులో ఏమైనా అనుమానాస్పద లోన్లు ఉంటే వెంటనే మీరు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మీరు వెంటనే ఆ లోన్ లెండర్‌కు ఫిర్యాదు చేయండి. క్రెడిట్ బ్యూరోతో మాట్లాడి ఆ ఎంట్రీపై ఆన్‌లైన్‌లో డిస్ప్యూట్ ఫైల్ చేయండి. ఐడీ ప్రూఫ్, లోన్ వివరాలు, అఫిడవిట్ సమర్పించండి.తరువాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వండి. మీ పాన్ దుర్వినియోగం చేశారని సాక్ష్యాలతో వారికి సమర్పించండి.
మీ పాన్ కార్డు నంబరును అసురక్షిత సైట్లు, యాప్స్ లేదా వాట్సాప్ ఫార్వర్డ్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. అనవసరమైన చోట పాన్ కార్డును ఇవ్వకండి. మీ పాన్ కార్డు ఒక వేళ మిస్సయితే వెంటనే రీప్రింట్ కోసం అప్లై చేసి, క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. మీ వ్యక్తిగత అకౌంట్లకు బలమైన పాస్‌వర్డ్‌లు, SMS/ఈమెయిల్ అలర్ట్స్ పెట్టుకోండి. మీరు మొబైల్ నంబర్ అలర్ట్ తప్సనిసరిగా పెట్టుకోండి.
ఏదేమైనా ముందు జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. మీ పాన్ కార్డును నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంపై అది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. చిన్న సమస్య కూడా పెద్దదిగా మారి మీ జీవితాన్ని కబళించేయవచ్చు. కాబట్టి అణుక్షణం అప్రమత్తత అవసరం. మీ PAN ఒక శక్తివంతమైన ఫైనాన్షియల్ ఐడి కాబట్టి దాన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడా దాని వివరాలు బయటపెట్టవద్దు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications