Applied Compute: రెండేళ్లలోనే రూ.40 వేల కోట్ల కంపెనీగా మారిన అప్లైడ్ కంప్యూట్.. ఎవరీ యష్ పాటిల్..!
ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిషియల్ ఇంటలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పుడు దాదాపు ప్రతి రంగంలో ఏఐని వాడుతున్నారు. దీంతో ఏఐ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. సంప్రదాయ ఐటీ కంపెనీలు వెనకబడిపోతున్నాయి. చిన్న చిన్న ఏఐ కంపెనీలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో ఏఐ స్టార్టప్ కంపెనీలు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఏఐ రంగంలో నిలదొక్కుకునే కంపెనీలు చాలా తక్కువగా ఉంది. తాజా ఓ ఏఐ స్టార్టప్ కంపెనీ అందరిని ఆశ్చర్య పరుస్తూ దూసుకెళ్తోంది. కంపెనీ రెండేళ్లలోనే వేల కోట్ల విలువైన సంస్థగా మారిపోయింది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల పారిశ్రామికవేత్త యష్ పాటిల్ ఓపెన్ఏఐలో పనిచేసిన అనుభవంతో అప్లైడ్ కంప్యూట్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించాడు.
ఈ కంపెనీ ఏఐ రంగంలో పని చేయడం ప్రారంభించింది. దీంతో కంపెనీ పనితీరు బాగుండడంతో ఈ చిన్న కంపెనీపై పెద్ద కంపెనీలు కన్ను వేశాయి. తాజాగా అప్లైడ్ కంప్యూట్ కంపెనీని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా 4.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.40వేల కోట్లకు ఈ చిన్న కంపెనీని కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలుకు సంబంధించి చర్చ జరుగుతోంది. యష్ పాటిల్ మరో ఇద్దరు మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు రిథమ్, లిండన్లతో కలిసి 2025 మేలో అప్లైడ్ కంప్యూట్‌ను స్థాపించాడు.

బయటి ఏఐ సేవలపై పూర్తిగా ఆధారపడకుండా.. కంపెనీలు తమ సొంత డేటాతో కస్టమ్ ఏఐ మోడళ్లను శిక్షణ ఇచ్చి, రోజువారీ కార్యకలాపాల్లో వినియోగించుకునేలా చూడటమే లక్ష్యంగా కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఈ కంపెనీ తక్కువ కాలంలో ఏఐపై పట్టు సాధించింది. దీంతో కంపెనీ పేరు అమెరికా వ్యాప్తంగా మారుమోగింది. తాగా ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అయిన తర్వాత యష్ పాటిల్ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో కో-చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. వచ్చే సంవత్సరం ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అయ్యే అవకాశం ఉంది.
యష్ పాటిల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే స్టార్టప్‌లపై ఆసక్తి తో ఈ-కామర్స్ వెబ్సైట్ల కోసం మెషిన్ లెర్నింగ్ టూల్స్ అందించే ఆర్మాడిల్లో ల్యాబ్స్ వంటి ప్రాజెక్టులపై పనిచేశాడు. స్టాన్ఫోర్డ్ వార్షిక హ్యాకథాన్ ట్రీహ్యాక్స్ ప్రాజెక్టులో వర్క్ చేశాడు. పాటిల్ 2023 ఏప్రిల్ లో ఓపెన్ఏఐలో టెక్నికల్ స్టాఫ్ రెసిడెంట్‌గా చేరి పోస్ట్-ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పని చేశాడు. అక్టోబర్‌లో ఫుల్-టైమ్ టెక్నికల్ పాత్రలోకి మారి కోడెక్స్ కోసం లాంగ్-హారిజన్ టాస్క్‌లపై పనిచేశాడు. 2025లో ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చాడు.
మరో ఇద్దరితో కలిసి అప్లైడ్ కంప్యూట్ కంపెనీ స్థాపించాడు. కంపెనీ 18 నెలల్లోనే 100 మిలియన్ డాలర్ల వార్షిక రెవెన్యూ రన్-రేట్ మైలురాయిని చేరింది. ఇన్వెస్టర్ ఎలాడ్ గిల్ నేతృత్వంలో 3.25 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద 350 మిలియన్ డాలర్లు సేకరించింది. మైక్రోసాఫ్ట్, షాపిఫై, డోర్‌డాష్, హార్వే, కాగ్నిషన్, క్లే, డెకాగాన్ వంటి దిగ్గజ సంస్థలు దీని క్లయింట్ల జాబితాలో ఉన్నాయి. ఇండియాలో కూడా ఏఐ స్టార్టప్ కంపెనీలు రావాల్సి అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications