ఏదైనా జాబ్ చేస్తే సాధారణంగా 15 వేల నుండి 20 వేల జీతం లభిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మాత్రం మొదట బేసిక్ పే స్కెల్, ఆ తరువాత రెగ్యులర్ పే స్కెల్ ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం ఉంటె కొన్ని అలవెన్సులు, ప్రభుత్వ సహకారాలు కూడా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ అంశం చాలా వేడెక్కింది. మనం ఫ్లయిట్ హైజాక్ చేయడం గురించి సినిమాల్లో ఎక్కువగా వింటుంటాం. కానీ ట్రైన్ హైజాక్ చేయడం అరుదు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఈ ఆపరేషన్ ముగిసిందని వాదిస్తుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికీ 154 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మా అదుపులో ఉన్నారని పేర్కొంది. ట్రైన్ హైజాక్ కావడానికిగల కారణాలను పెక్కనపెడితే అసలు ట్రైన్ హైజాక్ ఎలా సాధ్యం ఇంకా దీనికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తింది. ఇంకా ట్రైన్ డ్రైవర్లకు జీతాల గురించి కూడా చర్చ మొదలైంది.

పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్) జీతం గురించి మాట్లాడుకుంటే భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే మన భారతీయ కరెన్సీకి పాకిస్తాన్ కరెన్సీకి ఉన్న తేడా.. మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ జీతం 16,710 పాకిస్తానీ రూపాయలు (అంటే సుమారు 5202 రూపాయలు) నుండి 43,936 పాకిస్తానీ రూపాయలు (సుమారు 14 వేల రూపాయలు) వరకు ఉంటుంది. జీతం కాకుండా వారికి అలవెన్సులు ఇతర రకాల సౌకర్యాలు కూడా లభిస్తాయి.
జీతాల పెంపు: కాలక్రమేణా పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ల జీతంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. నివేదికల ప్రకారం, 5 సంవత్సరాల సర్వీస్ అందించిన తర్వాత వీరి జీతం 57 వేల పాకిస్తానీ రూపాయలకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓవర్ టైం, అలవెన్సుల కారణంగా జీతం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ట్రైన్ డైవర్లకు ట్రావెల్ అలవెన్సులతో పాటు మెడికల్ సౌకర్యాలు, పెన్షన్ కూడా లభిస్తాయి. మరోవైపు పాకిస్తాన్ రైల్వే ఉద్యోగులు జీతాల పెంపు కోసం నిరసనలు కూడా చేస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీతం చాలా తక్కువ అని వారు అంటున్నారు.
భారతదేశంలో ట్రైన్ డ్రైవర్ల జీతం ఎంత: భారతదేశంలో రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తారు. దింతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అన్ని సౌకర్యాలు రైల్వే ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో లోకో పైలట్ జీతం పాకిస్తానీ ట్రైన్ డ్రైవర్ జీతం కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో ట్రైన్ డ్రైవర్ ప్రారంభ జీతం రూ. 50-60 వేల నుండి మొదలవుతుంది. వారిని అసిస్టెంట్ లోకో పైలట్లు అంటారు. అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్ కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. ఇంకా జీతం పెరుగుతూనే ఉంటుంది. లోకో పైలట్ అయిన తర్వాత వారి జీతం నెలకు దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంటుంది. జీతంతో పాటు ట్రైన్ డ్రైవర్‌కు మెడికల్ & ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications