ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన షెహబాజ్ షరీఫ్.. పాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోన్నారు. అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజలపై అధిక ధరల భారం పడకుండా చూస్తోన్నారు. లోపాలను సరిచేయడం ద్వారా చాలావరకు ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా తక్షణ చర్యలను తీసుకుంటోన్నారని, అవి ఆశించిన ఫలితాలను ఇస్తోన్నాయని అక్కడి మీడియా స్పష్టం చేస్తోంది.

ఉత్పాదకతపై
ప్రభుత్వం మైనారిటీలో పడటం వల్ల అర్ధాంతరంగా పదవి నుంచి వైదొలగిన ఇమ్రాన్ ఖాన్ స్థానంలో షెహబాజ్ షరీఫ్- ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఉత్పాదకతను పెంచడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను పొడిగించారు. ఇకపై ఉద్యోగులందరూ రోజులో 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేశారు

అయిదు రోజుల పనికి బ్రేక్..
వారంలో అయిదు రోజుల పని వేళలను కూడా రద్దు చేశారు. ఇకపై ఆరు రోజుల పాటు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రెండు వీక్లీ ఆఫ్స్‌లో కోత పెట్టారు. ఇకపై అక్కడ వారంలో ఒకే రోజు సెలవు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను పెంచడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం భావిస్తోందని స్పష్టం చేసింది. రోజువారీ కార్యాకలాపాలు మరింత పెరుగుతాయని, ఫలితంగా రొటేషన్ వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా వేసింది.

ఆర్థిక భారం పడకుండా..
తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసకున్నారాయన. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై సంతకాలు చేయడానికి నిరాకరించారు. ఇంధన ధరలను పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనలను తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ రూపొందించిన ప్రతిపాదనలను పక్కన పెట్టారు. వాటికి ప్రధానమంత్రి ఆమోదించలేదని ఆయన కార్యాలయం తెలిపింది.

పెట్రోల్ రూ.149..
ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.149.86 పైసలు పలుకుతోంది. ఇక డీజిల్ ధర కూడా అదే స్థాయిలో ఉంటోంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.144.15 పైసలు. లీటర్ కిరోసిన్ రూ.35.50 పైసలు. దీన్ని భారీగా పెంచాలని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదించింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.51.32 పైసలు, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.21.30 పైసల మేర అదనపు భారం మోపాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ తిరస్కరించారు.

60 బిలియన్ డాలర్ల బకాయిలు..
పాకిస్తాన్ ప్రభుత్వం- ఆయిల్ కంపెనీలకు 30 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఇంధన రేట్లను పెంచుకోవడం వల్ల ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని అవి భావించాయి. దీన్ని తిరస్కరించడం వల్ల ఇక ముందు కూడా ఈ భారం రెట్టింపు అవుతుందని, 60 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి వస్తుందని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నిధులను సమీకరించుకోవడం, దుర్వినియోగాన్ని అరికట్టడం వల్ల కొంతవరకు లోటును భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications