దక్షిణాసియాలో టెక్నాలజీ హబ్‌గా ఎదగాలని చూస్తున్న పాకిస్థాన్ (Pakistan) తాజాగా అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్‌ను ఆకర్షించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ సాధిస్తున్న విజయాన్ని చూసి, ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది.

ఆపిల్ పెట్టిన మూడు ప్రధాన షరతులు
పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు ఆపిల్ యాజమాన్యం కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. వాటిలో ప్రధానమైనవి..
- తక్కువ ధరకే భూమి: ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించాలి.
- 8% పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్: తయారీ ఆధారంగా ప్రభుత్వ ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని 8 శాతానికి పెంచాలి.
- పాత ఫోన్ల మరమ్మతులు: రెండు మూడు ఏళ్ల నాటి పాత ఐఫోన్లను రీఫర్బిష్ (Refurbish) చేసి తిరిగి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
ఈ డిమాండ్లను పాకిస్థాన్ ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ బోర్డ్ (EDB) అంగీకరించింది. దీనివల్ల మొదటి ఏడాదిలోనే దాదాపు 100 మిలియన్ డాలర్ల విదేశీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
శిక్షణతో మొదలై.. తయారీ వరకు!
గతంలో ఆపిల్ సంస్థ ఇండోనేషియా, మలేషియా , భారత్‌లో కూడా ఇదే మోడల్‌ను అనుసరించింది. మొదట పాత ఫోన్ల మరమ్మతులు చేస్తూ స్థానిక కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత క్రమంగా కొత్త ఫోన్ల తయారీని ప్రారంభిస్తారు. పాకిస్థాన్ కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మొబైల్ తయారీదారులకు 6% ప్రోత్సాహకం ఇస్తుండగా, ఆపిల్ వంటి కంపెనీల కోసం దీనిని 8 శాతానికి పెంచుతున్నారు.
భారీ పెట్టుబడులు.. స్థానిక విడిభాగాల వాటా
కేవలం ఆపిల్ మాత్రమే కాకుండా, చైనా కంపెనీల నుంచి కూడా దాదాపు 557 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పాకిస్థాన్ ఆశిస్తోంది. దీనికోసం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే బీజింగ్‌లో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తయారయ్యే ఫోన్లలో స్థానిక విడిభాగాల (Local parts) వాటా కేవలం 12% మాత్రమే ఉంది. అయితే కొత్త పాలసీ ప్రకారం, మొదటి ఏడాదిలోనే దీనిని 35%కి, ఆ తర్వాత 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎగుమతులపై పన్ను , నిధుల సేకరణ
సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం నిధులు సేకరించడానికి ప్రభుత్వం కొత్త ఎగుమతి పన్నును (Export Levy) ప్రవేశపెట్టింది. లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్లపై 6% వరకు పన్ను విధించనున్నారు. దీని ద్వారా వచ్చే 62 బిలియన్ రూపాయలను స్థానిక మొబైల్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి 9 బిలియన్ రూపాయల సబ్సిడీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తానికి, ఆపిల్ రాకతో పాకిస్థాన్ ఎలక్ట్రానిక్స్ రంగం రూపురేఖలు మారుతాయని అక్కడి ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వాచీల తయారీలో కూడా స్వయం సమృద్ధి సాధించడమే తమ అంతిమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications