Pakistan Currency: స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దాయాది పాక్ తన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయటం కంటే భారత పతనం కోసం ఎక్కువగా నిధులు వెచ్చించింది. అయితే ఇప్పుడు ఇండియా గతంలో పాటించిన పద్ధతులనే అవలంభించే దారిలో కొనసాగుతోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ తన కరెన్సీ విలువ పడిపోవటంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దశాబ్ధాలు అక్కడి ప్రభుత్వ తప్పుడు విధానాలతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తాజాగా కొత్త కరెన్సీ నోట్లను విడుదలకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఇదే విషయాన్ని పాక్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రధానంగా నకిలీ నోట్ల బెడదతో అతలాకుతలం అవుతోంది. వీటితో ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది. కొత్త నోట్లు అంతర్జాతీయ అధునాతన భద్రతా సాంకేతికతతో ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ వెల్లడించారు. ఇందుకోసం కొత్త డిజైన్లు, హై సెక్యూర్డ్ నంబర్లను వాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది రానున్న కాలంలో అక్కడి ప్రజలకు పెద్ద కష్టాలను తెచ్చిపెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మరింత మందగించేందుకు దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే క్రమంలో ఐఎమ్ఎఫ్ నుంచి ఆర్థిక సహకారం కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాయాది దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగటం, ఇంధన-ఆహార ఖర్చులు ఆకాశాన్ని తాకటం సామాన్యులను రెండు పూటల తిండికి దూరం చేసింది. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం 58 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. అలాగే ఫారెక్స్ నిల్వలు సైతం 3 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోవటం మరింత ఆందోళనలకు దారితీస్తోంది.
నెలల చర్చల తర్వాత IMF నుంచి 3 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని పాకిస్తాన్ పొందగలిగింది. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి మిత్రదేశాలు కూడా పాక్ విదేశీ మారక నిల్వలను పెంచడానికి తమ వంతుగా సహాయం అందించాయి.


Click it and Unblock the Notifications