Pakistan Crisis: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పతనానికి దగ్గరగా చేరుకున్నట్లు చెప్పుకోవాలి. అక్కడ ఆర్థిక సంక్షోభం తీవ్రమై చిట్టచివరి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆ దేశ విదేశీ మారక నిల్వలు అడుగంటతంటో పరిస్థితులు అద్వానంగా మారాయి. పతనానికి ముందు శ్రీలంకలో కూడా అచ్చం ఇదే జరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్..
జనవరి 20తో ముగిసిన వారంలో తమ విదేశీ మారక నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించింది. దీంతో నిల్వలు అడుగంటి 3.678 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బయటి రుణాల చెల్లింపుల కారణంగా మారక నిల్వలు వారంలో 923 మిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ఈ ప్రభావం ఆ దేశంలోని ప్రతి పౌరుడిపై పడింది.

పోర్డుల్లో సరుకులు..
పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు కనీసం మూడు వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేందుకు సైతం సరిపోదని పాకిస్థాన్ వార్తా వెబ్‌సైట్ 'ది డాన్' వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్థాన్ పోర్టుల్లో దాదాపుగా 9,000 కంటైనర్లు నిలిచిపోయాయి. అలాగే పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ, సోయాబీన్ సహా అనేక నిత్యావసర వస్తువులు చెల్లింపుల కోసం ఓడరేవుల్లోనే వేచి చూస్తున్నాయి. కానీ వీటి చెల్లింపులకు సరిపడ్డా సొమ్ము పాక్ వద్ద లేకపోవటంతో సాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

IMF సాయం..?
ప్రస్తుత పరిస్థితుల్లో కఠినమైన షరతుల మీద నిధులను అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అంగీకరించింది. పాక్ కూడా చేసేది లేక వాటన్నింటికీ అంగీకరించింది. దీంతో పాక్ రూపాయి కూడా బలహీనపడుతోంది. IMF డిమాండ్లపై చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. చెల్లింపులకు డాలర్లు లేక దిగుమతులు నిలిచిపోవటంతో ప్రజలు పిండి, బియ్యం, వంట గ్యాస్ వంటి నిత్యావసరాలకు సైతం దూరమయ్యారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం 25 శాతానికి చేరువలో ఉంది.

భారత నిల్వలు ఇలా..
విదేశీ మారక నిల్వలు లేకపోవటంతో శ్రీలంక సంక్షోభంలోకి కూరుకుపోగా.. ప్రస్తుతం పాకిస్థాన్ సైతం అదే దారిలో పయనిస్తోంది. అయితే ఈ క్రమంలో అసలు భారత విదేశీ మారక నిల్వలపై అనేక మందిలో ప్రశ్నలు మెుదలయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. జనవరి 21, 2023తో ముగిసిన వారంలో భారత్ వద్ద 634.287 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో భారత ఫారెక్స్ నిల్వలు 573.727 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం పాక్ పరిస్థితి IMF దయపై ఆధారపడి ఉంది. అందుకే అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా చాలా షరతులు పెడుతోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications