For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol prices today: స్థిరంగా పెట్రోల్ ధరలు, భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (శుక్రవారం, మే 2022) కూడా స్థిరంగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ గతవారం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది. గత దీపావళి సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది.

కేంద్రం తగ్గింపును పక్కన పెడితే చమురు మార్కెటింగ్ సంస్థల పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నేపథ్యంలో నిన్న డీజిల్ ధర రూ.105.49 నుండి రూ.97.82కు తగ్గింది. నేడు యథాతథంగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 నుండి రూ.96.72, డీజిల్ రూ.96.67 నుండి రూ.89.62కు పడిపోయింది. ముంబైలో పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్ రూ.102.65, డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76, బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.97.81, డీజిల్ రూ.90.05గా ఉంది.

Pakistan hikes petrol and diesel prices, now almost double of India prices

దేశీయ చమురు రంగ సంస్థలు చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెంపును అమలు చేశాయి. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. అంతకుముందు నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వాహనదారులకు ఊరటను కల్పించింది.

ఇదిలా ఉండగా పాకిస్తాన్ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీంతో భారత్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు ధరలు ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96 వద్ద ఉండగా, పాకిస్తాన్ కరెన్సీలో 180 ఉంది. ఇదిలా ఉండగా రష్యా నుండి డిస్కౌంట్‌కు చమురును భారత్ కొనుగోలు చేయడం ద్వారా ఇక్కడ ధరలు తగ్గడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు పాకిస్తాన్‌లో ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి పెట్రోల్ ధరలు.

English summary

Petrol prices today: స్థిరంగా పెట్రోల్ ధరలు, భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు | Pakistan hikes petrol and diesel prices, now almost double of India prices

Imran Khan praises India again as Pak sees highest ever rise in petrol price. Pakistan hikes petrol and diesel prices, now almost double of India prices.
Story first published: Friday, May 27, 2022, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X