Pakistan Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నీడలో కొట్టుమిట్టాడుతోంది. కష్టకాలంలో సాయం కోసం చేతులు చాచి ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఐఎమ్ఎఫ్ సహాయం కోసం అది విధించే అన్ని షరతులకు అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐఎమ్ఎఫ్ నుంచి వీలైనంత త్వరగా 170 బిలియన్ రూపాయల ఆర్థిక సాయం పొందేందుకు పాక్ ప్రయత్నిస్తోంది.

ప్రజలపై భారం..
ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలకు కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం మరోసారి విద్యుత్తును ఖరీదైనదిగా మార్చింది. సగటు విద్యుత్ టారిఫ్‌పై యూనిట్‌కు రూ.3.39 ప్రత్యేక ఆర్థిక సర్‌చార్జి విధించేందుకు పాక్ క్యాబినెట్‌లోని ఆర్థిక సమన్వయ కమిటీ ఆమోదం తెలిపింది. ఏడాది వరకు యూనిట్ కు రూ.3.21 వరకు త్రైమాసిక సుంకం సర్దుబాటును కూడా ప్రతిపాదించింది.

పెంపు ఎందుకు..
మార్చి 1 నుంచి జీరో రేటెడ్ పరిశ్రమలకు అలాగే రైతుల ప్యాకేజీకి విద్యుత్ డ్యూటీ సబ్సిడీని నిలిపివేయాలని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అధ్యక్షతన జరిగిన ECC సమావేశం ఆమోదించింది. IMF షరతులను నెరవేర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనికి ముందు కరెంటు వినియోగంపై పాకిస్థాన్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే.

ద్రవ్యోల్బణం..
ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు అందుబాటులో లేక ప్రభుత్వ సాయం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. గోధుమ పిండి నుంచి ఉల్లిపాయల వరకు వస్తువులకు చాలా రెట్లు పెరిగాయి. ఇలాంటి సమయంలో కరెంటు బిల్లులు సైతం భారంగా మారటంతో పేద పాకిస్థానీలు ఆందోళన చెందుతున్నారు. దీనికి ముందు పాకిస్థాన్‌లోని నేషనల్ ఎలక్ట్రిక్ పవర్ రెగ్యులేటరీ అథారిటీ కరాచీ నగరంలో విద్యుత్ ధరలను యూనిట్‌కు రూ.3.30 పెంచింది.

అంధకారంలోకి నగరాలు..
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ లోని దాదాపు 30 నగరాలు అంధకారంలోకి జారుకుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరెంటు వినియోగదారులు యూనిట్ కు రూ.43 చెల్లిస్తున్నారు. తాజా పెంపు తర్వాత యూనిట్ కరెంట్ ధర రూ.46కి చేరుకుంటుందని తెలుస్తోంది. గత నెలలో విద్యుత్ సంక్షోభం కారణంగా పాకిస్థాన్‌లోని దాదాపు 30 నగరాలు అంధకారంలోకి జారుకున్నాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటుతున్న తరుణంలో పాక్ సంక్షోభం రోజురోజుకూ పెద్దదవుతోంది.

భారత్ కంటే..
భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ ప్రజలు విద్యుత్ కోసం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. భారతదేశంలో నివాస విద్యుత్ బిల్లు సగటు రేటు యూనిట్‌కు రూ.9గా ఉంది. అలాగే వ్యాపార వినియోగదారులకు యూనిట్ కరెంటు బిల్లు ధర రూ.10-20 మధ్య ఉన్నాయి. కానీ ప్రతి ఉదయం పాకిస్థానీలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాక్ పరిపాలకులు చేసిన పాపాలు ఇప్పుడు అక్కడి ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టి వేధిస్తున్నాయి. స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించటంపై పెట్టడంపై ప్రస్తుత నాయకులు లెంపలు వేసుకుంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications