Tax News: ప్రభుత్వం నడవాలంటే ఆదాయం కావాలి. అయితే ప్రజల నుంచి వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వాలు నిధులను పరిపాలన కోసం సమకూర్చుకుంటుంటాయి. సంక్షేమ పథకాల నుంచి రోజువారీ ప్రభుత్వ ఖర్చులు, ఉద్యోగుల జీతాల వరకు అన్ని ఖర్చులను నిర్వహించటానికి పన్ను ఆదాయం చాలా కీలకమైనది.
అయితే పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్థాన్‌లో పరిస్థితులు ఎంతలా దిగజారాయో ప్రస్తుత వార్త చెబుతుంది. వివరాల్లోకి వెళితే పాకిస్థాన్‌లో ప్రజలు ఆదాయపు పన్ను కట్టకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రజలు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని చక్కదిద్దేందుకు పాక్ ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయని వ్యక్తుల సిమ్ కార్డులను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేస్తున్నట్లు పాకిస్థాన్‌లోని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో సంచలన కథనం ప్రచురితమైంది.

ఇప్పటికే ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని 3,500 మంది సిమ్ కార్డులను బ్లాక్ చేసినట్లు వెల్లడైంది. 2023 సంవత్సరానికి ఐదు లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేలా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ ప్రభుత్వ రెవెన్యూ బోర్డు 5,000 మందికి దీని గురించి ఇప్పటికే SMS హెచ్చరికను కూడా జారీ చేసింది. వినియోగదారుడు సిమ్ కార్డును ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్‌లను సరిగ్గా ఫైల్ చేయాలంటూ హెచ్చరిక మెసేజ్‌లు వచ్చాయి. పాకిస్థాన్‌లో పనిచేస్తున్న టెలికాం కంపెనీలు సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఎంతమంది సిమ్‌కార్డులు డిజేబుల్ అయ్యాయనే వివరాలను ఆ దేశ రెవెన్యూ బోర్డుకు అందించినట్లు తెలుస్తోంది.
అలాగే పన్నులు సరిగా చెల్లించని వారి మొబైల్ బ్యాలెన్స్ నుంచి కట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఒకరి మొబైల్ బ్యాలెన్స్ 100 పాకిస్తానీ రూపాయలు అయితే.. దానిలో నుంచి 90 పాకిస్థానీ రూపాయలు ఆటోమెటిక్‌గా కట్ చేయబడి నేరుగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి వెళతాయని తెలుస్తోంది. దీనికి తోడు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోవడం వల్ల సిమ్ కార్డ్ డిసేబుల్ అయిన వారు కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసేందుకు 90% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన కూడా ప్రవేశపెట్టబడింది. అదే క్రమంలో తిరిగి రిటర్న్‌లు దాఖలు చేస్తే వారి సిమ్ కార్డులు ఆటోమేటిక్‌గా రీయాక్టివేట్ అవుతాయని దేశ రెవెన్యూ బోర్డు తెలిపింది.
మార్చి 1వ తేదీ వరకు పాకిస్థాన్‌లో దాదాపు 42 లక్షల మంది తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. కానీ 2022లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 59 లక్షలుగా ఉంది. టాక్స్ లిమిట్స్ కిందకు వచ్చే వ్యక్తులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా రిటర్న్స్ దాఖలు చేయాలని తాజా చర్యలతో పాక్ ప్రభుత్వం నొక్కి చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దాయాది దేశం ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితిలో ఉండటం ప్రస్తుతం పరిస్థితులను ప్రేరేపించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications