Pakistan: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ టిక్కింగ్ టైమ్ బాంబ్ లాగా మారింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి దోహదపడిన అంశాలు పాకిస్థాన్‌పై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. పాకిస్థాన్ పరిస్థితి సైతం అచ్చం అలాగే తయారైంది. దీనికి తోడు ఇటీవల దేశాన్ని అతలాకుతలం చేసిన వరదలు పరిస్థితులను మరింత దిగజార్చాయి.

సమస్యల సుడిగుండం..
పాకిస్థాన్ పెద్ద మొత్తంలో అప్పులు, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ దేశం ఎదుర్కొంటున్న బహుళ సవాళ్లు ప్రజలతో పాటు నేతలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యావసర వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడటం, పరిమిత ఫారెక్స్ నిల్వలు, స్వేచ్ఛా వాణిజ్యంపై పరిమితులు, పేరుకుపోయిన విదేశీ రుణాలు పాకిస్థాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో పతనానికి ముందు శ్రీలంక సైతం అచ్చం ఇలాంటి భయంకరమైన పరిస్థితులనే ఎదుర్కొంది.

చైనా అప్పులు..
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)ను ప్రస్తుతం 55 బిలియన్ డాలర్లు రుణంతో నిర్మిస్తున్నారు. ఇది పాకిస్థాన్ తన సార్వభౌమ హామీలో భాగంగా చైనా నుంచి పొందింది. ఈ పెట్టుబడులకు పాకిస్థాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారి ఈక్విటీపై డాలర్ పరంగా 17-20 శాతం రిటర్న్ రేటు ఉంది. డెట్-టు-ఈక్విటీ నిష్పత్తి 80 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుంది. చైనా తన పెట్టుబడి ఖర్చును 26 నెలల్లోపు తిరిగి పొందుతుంది. ఇంత భారీ చెల్లింపుల వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుంటుబడుతోంది.

శ్రీలంక పతనం..
ఈ సందర్భంలో శ్రీలంక ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితులకు అద్దం పడుతోంది. చైనా డెట్-ఈక్విటీ స్వాప్ విధానంలో.. శ్రీలంక హంబన్‌టోట పోర్ట్, పవర్ ప్లాంట్‌ను బదిలీ చేసింది. చైనాకు అప్పులను తిరిగి చెల్లించలేక పోయినందున విమానాశ్రయాన్ని చైనా నియంత్రణకు బదిలీ చేయవచ్చు. శ్రీలంక ఆదాయంలో 90 శాతం అప్పుల చెల్లింపులకు వినియోగించాల్సి వచ్చింది.

వెనుజులా దుస్థితి..
చైనా ఏ దేశంలోనూ చేయనంత భారీగా వెనుజులాలో పెట్టుబడులను పెట్టింది. 2008 నుంచి 2014 వరకు 52 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. చైనా అప్పులకు వెనుజులా కమోడిటీస్ సెక్యూరిటీగా ఉంచింది. దీనివల్ల చైనాకు వెనుజులా మిలియన్ల కొద్ది బ్యారెళ్ల క్రూడ్ ఆయిన్ ను సరఫరా చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందడానికి ఈ చమురు దోహదపడుతోంది. రానున్న కాలంలో పాకిస్థాన్ కి కూడా ఇలాంటి పరిస్థితులే రానున్నాయి ఎందుకంటే చైనా అప్పులు పాక్ జీడీపీలో 70 శాతానికి దగ్గరగా ఉంది.

వడ్డీ భారం..
చైనా అప్పులకు 7 శాతం వడ్డీ వరకు చెల్లిస్తోంది. పాక్ 25-40 ఏళ్లు ఈఎంఐల రూపంలో చెల్లిస్తోంది. సీపీఈసీలో పెట్టుబడి ఒప్పందాలు చైనాకు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయి. చైనీస్ వాహనాలకు టోల్ పన్ను మినహాయింపు, చైనీస్ వర్క్‌ఫోర్స్‌కు ప్రాధాన్యతలు ఇందులో భాగమే. శ్రీలంకలోనూ చైనా ఇలాంటి పద్ధతినే అనుకరించింది. వీటివల్ల దేశాలు అప్పులు చెల్లించలేక మరిన్ని రుణాలు చేస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications