Pakistan News: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. మోయలేని అప్పుల భారానికి ద్రవ్యోల్బణం తోడై ఖర్చులను అమాంతం పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు పాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అయిన మార్గాన్నే ఎంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు.. చెలామణిలో ఉన్న అత్యధిక విలువ కలిగిన 5,000 రూపాయల నోటును రద్దు చేయాలని పాకిస్థాన్‌కు చెందిన ఆర్థికవేత్త ఒకరు సూచించారు. ఈ మార్గాన్ని అనుకరించిన భారతదేశంలో అద్భుత ఫలితాలు రావటంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరిగాయని ఎనర్జీ ఎకనామిస్ట్ అయిన అమ్మర్ ఖాన్ ఇటీవల అన్నారు.

విదేశీ మారక నిల్వల క్షీణతను ఎదుర్కొంటున్న పాక్ ద్రవ్యోల్బణంతో పాటు పన్ను రాబడి తగ్గటాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకపోతే శ్రీలంక మాదిరిగానే డిఫాల్ట్ అయ్యే ప్రమాదంలో పడనుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. భౌతిక కరెన్సీ చెల్లింపుల వినియోగం వల్ల.. పన్నులు చెల్లించని అనధికారిక ఆదాయం పాక్ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువైందని ఆర్థిక వేత్త చెప్పారు. ఈ క్రమంలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చెలామణి నుంచి రద్దు చేయాలని వీటిని ఎక్కువగా కలిగి ఉండేది ధనవంతులేనని వారు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఎక్కువగా పన్ను చెల్లించని డబ్బు రొటేట్ అవుతోందని ఆర్థిక వేత్త నజం అలీ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లావాదేవీలకు పాకిస్థాన్ కరెన్సీ వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని అన్నారు. దీనికి ముందు భారత ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఆర్థిక వ్యవస్థలోని నల్లధనాన్ని వెలికితీయటమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ సాహనాన్ని చేసింది. ఆ తర్వాత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావటంతో డిజిటల్ చెల్లింపుల యుగం విజయవంతంగా కొనసాగుతోంది.
దీనిపై స్పందిస్తున్న కొంతమంది భారతదేశంలో చేపట్టిన నోట్ల రద్దు చిన్న వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాక్ ఆర్థిక వేత్తలు పరగణలోకి తీసుకోవాలన్నారు. నోట్ల రద్దును పాక్ లో అమలు చేస్తే అక్కడి ధనవంతులు తమ సంపదను బంగారం లేదా అమెరికన్ డాలర్లలోకి మార్చుకునే అక్రమమార్గాలను ఆశ్రయిస్తారని నరోవల్ జిల్లా మాజీ మేయర్ అహ్మద్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications