పాకిస్థాన్‌లో వింతలు, విడ్డూరాలకు కొదవ ఉండదు. తాజాగా అక్కడి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఒక పని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ట్రోల్ అవుతోంది. బ్రాండెడ్ పిజ్జా హట్ (Pizza Hut) అనుకుని ఆయన ఒక రెస్టారెంట్ ను ప్రారంభించగా.. తీరా అది 'ఫేక్' అని తేలడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఖవాజా ఆసిఫ్ అభాసుపాలు: అసలేం జరిగింది?
పాకిస్తాన్ (Pakistan) రక్షణ మంత్రి చేసిన ఓ పనికి ప్రస్తుతం నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ లో ఇటీవల ఒక పిజ్జా సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 'పిజ్జా హట్' బోర్డు ఉన్న ఆ రెస్టారెంట్‌ను ఆయన ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అసలు కథ బయటపడింది.
పిజ్జా హట్ ఇచ్చిన షాక్!
సోషల్ మీడియాలో మంత్రి ఓపెన్ చేసిన రెస్టారెంట్ ఫొటోలు వైరల్ కావడంతో.. ఈ పిజ్జా హట్ పాకిస్థాన్ సోషల్ మీడియా వేదికగా ఒక స్పష్టత ఇచ్చింది. ఆ రెస్టారెంట్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది.
"సియాల్‌కోట్ లో ప్రారంభించిన ఆ రెస్టారెంట్ మా బ్రాండ్‌కు చెందింది కాదు. అది అనధికారికంగా మా ట్రేడ్‌మార్క్ ను వాడుకుంటోంది. పాకిస్థాన్‌లో మాకు కేవలం 16 అధికారిక అవుట్‌లెట్లు మాత్రమే ఉన్నాయి (లాహోర్‌లో 14, ఇస్లామాబాద్‌లో 2). సియాల్‌కోట్‌లో మాకు ఎలాంటి బ్రాంచ్ లేదు" అని కంపెనీ కుండబద్దలు కొట్టింది. అంతేకాకుండా తమ పేరును తప్పుగా వాడుతున్నందుకు సదరు యజమానిపై ఫిర్యాదు కూడా చేసింది.
సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
ఒక దేశ రక్షణ మంత్రి హోదాలో ఉండి.. కనీసం అది ఒరిజినల్ అవుట్‌లెట్ అవునా? కాదా? అని కూడా విచారించకుండా ప్రారంభోత్సవం చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. "పాకిస్థాన్‌లో పిజ్జా కూడా నకిలీయేనా?" అని ఒకరు కామెంట్ చేయగా, "పాకిస్థాన్ రక్షణ మంత్రికి పిజ్జా హట్ ఇచ్చింది 'నాట్ అవర్ స్లైస్' (ఇది మా ముక్క కాదు)" అంటూ మరొకరు ఎగతాళి చేస్తున్నారు. ఇలా ఈ పోస్ట్ చుట్టూ చాలానే జోకులు పేలుతున్నాయి.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందా?
ట్రోల్స్ సంగతి పక్కన పెడితే ఈ ఉదంతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో వేల సంఖ్యలో అవుట్‌లెట్లు ఉన్న పిజ్జా హట్‌కు, పాకిస్తాన్ (Pakistan) లాంటి దేశంలో కేవలం 16 అవుట్‌లెట్లు మాత్రమే ఉండటం అక్కడి ఆర్థిక సంక్షోభానికి నిదర్శనం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ బ్రాండ్లనే అసలైనవిగా భావించి మంత్రులే ప్రమోట్ చేయడం హాస్యాస్పదంగా మారింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications