Pakistan Debt Crisis: దాయాది దేశం పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాకిస్తాన్ లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం కారణంగా దాయాది దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చి పడింది. తాజాగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిన్న (జూన్ 09) విడుదలైన పాకిస్తాన్ ఆర్థిక సర్వేలో.. పాకిస్తాన్ అప్పులు ఆల్ టైమ్ హైకి పెరిగాయి. దీని కారణంగా, భవిష్యత్తులో పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించినట్లు నివేదికలో వెల్లడైంది. దాయాది దేశం పాకిస్తాన్ మొత్తం ప్రభుత్వ అప్పులు మార్చి 2025 నాటికి పాకిస్తాన్ రూపాయలలో దాదాపు 76,007 బిలియన్లకు చేరుకుంది. ఇది ఆ దేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికమని చెప్పవచ్చు. ఈ అప్పులతో ప్రజలను, దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా.. ఆ మొత్తాన్ని ఉగ్రవాదంపై ఖర్చు చేస్తుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ సత్యం.

గత 4 ఏళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వ అప్పు దాదాపు డబుల్ అయింది. గత 2020-21 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రభుత్వ అప్పు రూ. 39,860 బిలియన్లు ఉంది. అలాగే 10 సంవత్సరాల క్రితం ఇది రూ. 17,380 బిలియన్లు. కానీ ఇప్పుడు అది దాదాపు 5 రెట్లు పెరిగి పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పుడున్న అప్పులో రూ. 76,007 బిలియన్ల మొత్తంలో దేశీయ అప్పు రూ. 51,518 బిలియన్లు కాగా విదేశీ అప్పు రూ. 24,489 బిలియన్లు ఉన్నాయి.ఈ అధిక అప్పు, వడ్డీ భవిష్యత్తులో పాకిస్తాన్ కు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని నివేదిక హెచ్చరించింది. దీనిని నియంత్రించలేకపోతే ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రతను పెను ప్రమాదంలో పడేస్తుందని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను పేదరికం నుండి బయటపడేసింది. కానీ పాకిస్తాన్ తన జనాభాలో దాదాపు 45 శాతం మంది ఇంకా పేదరికంలో జీవిస్తున్నారని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఇంకా చెప్పాలంటే 16.5 శాతం మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని తెలిపింది. ఇతర దేశాలలో బిచ్చగాళ్లలా జీవిస్తున్నారని పేర్కొంది. ఇక మొన్న జరిగిన 'ఆపరేషన్ సింధ్' తర్వాత ..పాకిస్తాన్ తన సైనిక నిర్మాణానికి ఖర్చును పెంచాలని యోచిస్తోంది. ఇది పాకిస్తాన్‌ను మరింత అప్పులు తీసుకునే పరిస్థితిలోకి నెట్టివేసింది.
పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, Asian Development Bank నుండి చైనా వరకు పాకిస్తాన్ రుణాలు తీసుకోవడం ద్వారా మనదేశాన్ని బెదిరించాలనే చూస్తుండవచ్చు. కాని దాని పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ అప్పు ఇప్పుడు 76,000 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెరిగిందంటే దాయాది దేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అప్పుల కుప్ప కారణంగా ఆర్థిక రేటు కూడా 2.7%గా అంచనా వేశారు.
ఆర్థిక సర్వేలో వెల్లడైన ఇతర గణాంకాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ అక్షరాస్యత రేటు 67 శాతంగా ఉంది.దీనిలో పంజాబ్ అత్యధిక అక్షరాస్యత రేటు 66% కలిగి ఉంది.ఇక సింధ్‌లో 57.5%, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 51%, బలూచిస్తాన్‌లో 42% అక్షరాస్యత నమోదైంది.ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బడ్జెట్‌ను ఈరోజు జూన్ 10న జాతీయ అసెంబ్లీలో పెట్టనుంది. మరి బడ్జెట్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది.
2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాస్తవ GDP 2.6 శాతం, 2026 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 3.6 శాతం పెరుగుతుందని IMF అంచనా వేస్తోంది. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం 4.2 శాతం GDPని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతదేశంపై ఉగ్రవాద లక్ష్యాలను నెరవేర్చడానికి పాకిస్తాన్ ప్రపంచం నలుమూలల నుండి అందుతున్న సహాయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఇండియా.. IMF, ప్రపంచ బ్యాంకు ముందు పెట్టింది. వెంటనే దాయాది దేశానికి నిధులు ఆపాలని కోరుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications