స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) సోమవారం వడ్డీ రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 11%కి కుదించింది. అయితే పాకిస్తాన్ అమెరికా సుంకాల పెంపు అలాగే పెరుగుతున్న భారత పాక్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఎదురుదెబ్బను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆశ్చర్యకరమైన చర్య వచ్చింది.

సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కంటే చాలా తీవ్రంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 36 మంది ఆర్థికవేత్తలలో కేవలం 13 మంది మాత్రమే తగ్గింపు ఆశించారు ఇంకా కేవలం ముగ్గురు మాత్రమే ఈ చర్య స్థాయిని ఖచ్చితంగా అంచనా వేశారు. పాకిస్తాన్ ఆర్థిక పునరుద్ధరణను దెబ్బతీసే వాణిజ్య సుంకాలు అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాల చుట్టూ పెరిగిన ప్రపంచ అనిశ్చితిని SBP ఈ కోతను సమర్థించింది.
ఈ ఆర్థిక సంక్షోభానికి అతిముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ రకాల దిగుమతులపై కొత్తగా 29% సుంకాలు విధించడం. ఈ సుంకాలు పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య ఆదాయాలకు, ఆ దేశ ప్రధాన ఎగుమతి రంగాలను ముఖ్యంగా టెక్స్టైల్, వ్యవసాయం ఇంకా తయారీ వస్తువులను దెబ్బతీస్తాయని భావిస్తున్నారు. ఈ సుంకాల దెబ్బ ఎగుమతిలను దెబ్బతీస్తుందని, స్థానిక పరిశ్రమలను కష్టాల్లోకి నెట్టేస్తుందని సంక్షోభాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ద్రవ్యోల్బణం గత సంవత్సరం రికార్డు స్థాయిల నుండి చూస్తే కొంత తగ్గింది. అయితే, సప్లయ్ చైన్ అంతరాయాలు, అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే నెలల్లో ధరల ఒత్తిళ్లు రావచ్చని కేంద్ర బ్యాంకు హెచ్చరించింది. భారతదేశంలోని కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 25 మందికి పైగా ప్రాణాలను కోల్పోయాక, దేశంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. కాశ్మీర్లో ప్రతీకార చర్యలు, సైనిక బలగాల మోహరింపులు పాకిస్తాన్ దుర్బల స్థితికి తోడయ్యాయి.
ఈ నష్టాలు అన్ని ఉన్నప్పటికీ జూన్‌తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిని 2.5% నుండి 3.5% మధ్య SBP అంచనా వేస్తుంది. అయితే పరిస్థితుల స్థిరత్వం, అంతర్జాతీయ ఆర్థిక సహాయం పొందడంపై ఈ అంచనా చాలా ఆధారపడి ఉంటుంది.
ఆ విషయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ వారం సమావేశం కానుంది, దీనితో పాటు $1.3 బిలియన్ల కొత్త సౌకర్యాలని కూడా ఆమోదించనుంది. ఈ పెట్టుబడులు విదేశీ మారక నిల్వలను పెంచుతాయని, కరెన్సీ ఒత్తిళ్లను తగ్గిస్తాయని, ప్రపంచ భయాలకు వ్యతిరేకంగా స్వల్పకాలిక రిలీఫ్ అందిస్తాయని భావిస్తున్నారు. రాబోయే నెలల్లో ధరల పెరుగుదల కూడా ఉంటుందని మానెటరీ అథారిటీ అంచనా వేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications