Pakistan: అసలు ఇచ్చిన మాట మీద నిలబడని దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్ అని చెప్పుకోక తప్పదు. అక్కడి నాయకుడు చాలా కాలంగా అంతర్జాతీయ సంస్థలు, దేశాలకు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఆదేశాన్ని అంతర్జాతీయ సమాజం సైతం దాదాపు వెలివేసింది.

సంక్షోభంలోనూ మారని బుద్ధి..
అయితే ప్రస్తుతం పాక్ అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కనీసం ఇంధన అవసరాలను తీర్చేందుకు డబ్బులు కూడా లేవు. అచ్చం శ్రీలంక పతనం జరగటానికి ముందు ఏం జరిగిందో ప్రస్తుతం పాకిస్థాన్ లో అదే జరుగుతోంది. అయితే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రష్యా నుంచి చౌక ధరకు పెట్రోల్, డీజిల్ పొందాలని భావిస్తోంది. అందుకోసం ఆ దేశంలో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో కిలో చికెన్ ధర రూ.600కు పైగానే ఉండగా.. మిగిలిన నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. మరోపక్క దేశం చీకట్లలో మగ్గుతోంది.

ఉక్రెయిన్ కు ఆయుధాలు..
ఒక పక్క రష్యా సాయం కోసం కాళ్ల భేరానికి చర్చలు చేస్తున్న పాకిస్థాన్.. మరో పక్క ఉక్రెయిన్ కు సాయం చేస్తోంది. ఈ క్రమంలో పాక్ తాజాగా పది వేలకు పైగా రాకెట్ లాంఛర్లను సరఫరా చేసింది. వీటిని జర్మనీ పోర్టు మీదుగా పోలాండా నుంచి తరలించినట్లు సమాచారం. కరాచీకి చెందిన ప్రాజెక్ట్ షిప్పింగ్ గత నెలలో 146 కంటైనర్ల ఆయుధాలను సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీనికి బదులుగా MI-17 హెలికాప్టర్లను అప్‌గ్రేడ్ చేయడంలో సహకరిస్తామని దాయాదికి ఉక్రెయిన్ హామీ ఇచ్చింది.

గత ఏడాదిలోనూ..
2022లోనూ పాక్ ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేసింది. గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా పాక్ నుంచి ఉక్రెయిన్‌ను ఆయుధాలను తరలించింది. గడచిన రెండు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య 1.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు జరిగాయి. అలా దాయాది యుద్ధంలో ఉన్న రెండు దేశాలనూ తన స్వార్థం కోసం వినియోగించుకుంటోంది. ఒక పక్క తక్కువ ధరకు ఇంధనాన్ని సరఫరా చేయాలంటూ రష్యాను కోరుతూనే.. మరోపక్క దానితో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు ఆయుధాల సాయం అందిస్తోంది.

లాభం వారికే..
యుద్ధంలో నిజంగా గెలిచేది పోరాటంలో ఉన్న రెండు దేశాలు కాదు. వారికి ఆయుధాలు సరఫరా చేసి సొమ్ము చేసుకునే దేశాలేనని గతంలోనూ చాలా సార్లు స్పష్టమైంది. రెండు దేశాల చిచ్చును చల్లారకుండా చలికాసుకుంటున్న అగ్రదేశాలు తమ ఆయుధాలను అమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నాయి. అలా ఉక్రెయిన్ కు బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రిని అందిస్తున్నాయి. యుద్ధ సాయం మాటున తమ దేశాల పవర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications