నేడు పాకిస్తాన్ అలాగే పిఓకెపై భారతదేశం చేసిన దాడి కారణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలి 6000 పాయింట్లకు పైగా పతనం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' కింద పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదులపై ఈ చర్య తీసుకుంది. ఈ దాడిలో చాల వరకు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ ప్రతీకార చర్య తీసుకుంది.

6000 పాయింట్లకు పైగా పతనం: ఈ దాడి తర్వాత పాకిస్తాన్ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) సూచీ ఉదయం దారుణంగా పడిపోయింది. నిన్న చూస్తే KSE-100 113568.51 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 6000 పాయింట్లకు పైగా పతనమై 107296.64 వద్ద ప్రారంభమైంది. అంటే 5.52 శాతం తగ్గుదల కనిపించింది. కాసేపటికి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కొంతవరకు కోలుకున్నట్లు అనిపించినప్పటికీ పెద్దగా పెరగలేదు.
పహల్గామ్ దాడి తర్వాత భారీ పతనం: గత నెల ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి ఘటన మీకు తెలిసిందే. ఆ రోజున KSE-100 సూచీ 118430.35 పాయింట్ల వద్ద ముగిసింది. అప్పటి నుండి KSE-100 సూచీ 9.40 శాతం పడిపోయింది. దింతో పాక్ స్టాక్ మార్కెట్ భారీ ఎదురుదెబ్బను చూస్తోంది.
ప్రముఖ కంపెనీల షేర్లు: మరోవైపు ఏప్రిల్ 30న కూడా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. ఆ సమయంలో KSE-100 ఇండెక్స్ 3.09% పడిపోయింది. ఇంకా LUCK, ENGROH, UBL, PPL, FFC వంటి ప్రముఖ కంపెనీల షేర్లు బాగా పడిపోయాయి.
నిపుణులు ఏమంటున్నారంటే : మే 2న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ 2.5% కోలుకుంది, కానీ నిపుణులు ఇది 'డెడ్-క్యాట్ బౌన్స్' కావచ్చునని అంటున్నారు. అంటే మార్కెట్ కొంతకాలం తరువాత మెరుగుపడింది, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే మార్కెట్‌లో పెరుగుదల ఆశలు చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.
పాకిస్తాన్‌పై భారత సైన్యం దాడుల తరువాత ఇవాళ రక్షణ సంస్థల షేర్లు పెరిగాయి. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ షేర్లు 4% వరకు పెరగ్గా, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షేర్లు దాదాపు 2% పెరిగి రూ.4,589కి చేరుకున్నాయి. వీటితో పాటు కొచ్చిన్ షిప్‌యార్డ్, భారత్ డైనమిక్స్, డేటా ప్యాటర్న్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరాస్ డిఫెన్స్ మొదలైన వాటి షేర్లు కూడా పెరిగాయి. అదేవిధంగా పరాస్ డిఫెన్స్ వాటా కూడా దాదాపు 5 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications