Investment: భారతీయ స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్టాక్ MRF. మంగళవారం నాడు దాని ఒక్కో షేర్ విలువ రూ.82,825.45గా ఉంది. అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది రెండవ స్థానంలో నిలిచిన ఖరీదైన మరో స్టాక్ గురించి. అసలు ఒక్కో షేరుకు రూ.19 వేలు లాభం అనే మాట వింటేనే కళ్లు తిరుగుతున్నాయి. అసలు ఇది సాధ్యమా అని మనలో చాలా మందికి అనుమానం కలగవచ్చు. అయితే మనం ఇప్పుడు ఆ స్టాక్ గురించి తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పేజ్ ఇండస్ట్రీస్ గురించే. ప్రస్తుతం ఈ స్టాక్ భారత స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ అయిన NSEలో రెండవ ఎక్స్పెన్సివ్ స్టాక్ గా కొనసాగుతోంది. దీని ఒక్కో షేర్ ధర ఏకంగా రూ.52,202.90గా ఉంది. ఈ స్టాక్ ఏడాది కాలంలో తన పెట్టుబడిదారులకు 57.86 శాతం రాబడును అందించింది.

రూ.19 వేలు లాభం..
ఏడాది కిందట పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర రూ.33,068.85 వద్ద ఉంది. ఈ కాలంలో ఒక్కో షేరుకు రూ.19,134.05 పెరిగింది. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్లకు భారీ రాబడులను అందించింది. స్టాక్ ధర ఈ రోజు మధ్యాహ్నం 12.32 గంటలకు రూ.53,548.60గా ఉంది. ఈ ఒక్క రోజే స్టాక్ ధర రూ.1,345.70 పెరిగింది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠ ధరకు దగ్గరగా ట్రేడ్ అవుతోంది.

స్టాక్ ధర చరిత్ర..
పేజ్ ఇండస్ట్రీస్ 52 వారాల గరిష్ఠ ధర రూ.53,616.35గా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.32,252.50గా ఉంది. గత నెలతో పోల్చితే షేర్ ధర రూ.4.58 శాతం లాభపడింది. గడచిన మూడేళ్ల కాలంలో ఈ స్టాక్ 147.59 శాతం పెరిగింది. అదే ఆదేళ్ల కాలాన్ని చూసినట్లయితే షేర్ ఏకంగా 180 శాతానికి పైగా రాబడిని అందించింది. ఇది మల్టీబ్యాగర్ రాబడులని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత సమయంలో 21 మందిలో 10 మంది మార్కెట్ నిపుణులు BUY రేటింగ్ ఇస్తున్నారు. 8 మంది హోల్డ్ రేటింగ్ అందిస్తున్నారు. 7 రోజుల క్రితం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 52,000కు చేరుతుందని అంచనా వేయగా స్టాక్ ఈ అంచనాలను సైతం దాటి ట్రేడ్ అవుతోంది.

కంపెనీ వ్యాపారం..
భారత దేశానికి చెందిన ఈ కంపెనీ ఇన్నర్ వేర్స్ తయారీలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. జాకీ ఉత్పత్తులను తయారు చేయటానికి కంపెనీ లైసెన్స్ కలిగి ఉంది. కంపెనీ శ్రీలకం, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కంపెనీ 1994లో ప్రారంభించబడింది. కంపెనీ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. కంపెనీ ప్రఖ్యాత స్పీడో బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. జాకీ సంస్థ ఉత్పత్తులు ప్రపంచంలో 140 దేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications