Page Industries Dividend: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు క్యూ 2 ఫలితాలపై ప్రస్తుతం తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించే సమయంలో ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్ల ప్రకటన వంటివి అందిస్తున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ల పతనంలోనూ ఇన్వెస్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ గురించే. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈ కంపెనీ షేర్లు మాత్రం ఇంట్రాడేలో 7 శాతానికి పైగా లాభపడింది. వాస్తవానికి నేడు షేర్లు స్థిరమైన వృద్ధిని సాధించటానికి ప్రధాన కారణాల్లో ఒకటి కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.250 చొప్పున డివిడెండ్ అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కంపెనీ ఈ ప్రకటన చేయటంతో ఇంట్రాడేలో స్టాక్ ధర ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.48,333 స్థాయికి చేరుకున్నాయి. దీంతో స్టాక్ ధర సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని చేరుకుంది.

దీనికి ముందు సైతం కంపెనీ ఏడాది ప్రారంభంలో ఒక్కో షేరుకు రూ.300 చొప్పున ఇన్వెస్టర్లకు డివిడెండ్ అందించిన సంగతి తెలిసిందే. గడచిన 5 ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు దాదాపు 10 శాతానికి పైగా లాభపడ్డాయి. నిపుణులు సైతం ప్రస్తుతం కంపెనీ షేర్లపై తమ బులిష్ వ్యూ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి 6.12 శాతం పెరిగి రూ.47,823.20 వద్ద స్థిరపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,340 కోట్లకు చేరుకుంది. డివిడెండ్ చెల్లింపు కోసం కంపెనీ రికార్డు తేదీని నవంబర్ 14, 2024ను నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ అందిస్తున్న డివిడెండ్ ప్రయోజనాన్ని అందుకోవాలంటే పైన సూచించబడిన రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే కంపెనీ రికార్డ్ బుక్స్ ప్రకారం షేర్ హోల్డర్లుగా డివిడెండ్ పొందేందుకు అర్హతను అందుకుంటారు.
CNBC TV18 ప్రకారం దాదాపు 22 మంది నిపుణులు స్టాక్ పై కొనుగోలు రేటింగ్ కలిగి ఉన్నారు. ఈ క్రమంలో వారు కంపెనీ షేర్లకు రూ.54,000ను టార్గెట్ ధరగా నిర్ణయించారు. రానున్న ఏడాది కాలంలో ఈ ధరకు స్టాక్ పెరగవచ్చని బ్రోకరేజీలు అభిప్రాయపడుతున్నాయి. ఇక స్టాక్ పనితీరును పరిశీలిస్తే గడచిన 6 నెలల కాలంలో దాదాపు 40 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు అందుకున్న రాబడులను పరిశీలిస్తే.. 10 ఏళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 420 శాతం భారీ రాబడిని తన పెట్టుబడిదారులకు అందించి వారిని సంపన్నులు మార్చేసింది.
కంపెనీ వ్యాపారం..
పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ ఇన్నర్ వేర్, లాంజ్‌వేర్, సాక్స్‌ల తయారీదారు అండ్ రిటైలర్. ప్రస్తుతం కంపెనీ ఇండియాతో పాటు.. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, ఖతార్, మాల్దీవ్స్, భూటాన్‌లలో జాకీ ఇంటర్నేషనల్ ప్రత్యేక లైసెన్స్ కలిగిన ఉత్పత్తి, విక్రయదారుగా కొనసాగుతోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications