Page Industries Dividend: గడచిన కొన్ని వారాలుగా దేశంలోని అనేక స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమను నమ్ముకున్న పెట్టుబడిదారులపై వరాల జల్లు కురిపిస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్లు ఇస్తుండగా మరికొన్ని బోనస్ షేర్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా కంపెనీ తన పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో బహుమతిని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు రూ.150 డివిడెండ్ ఆదాయంగా అర్హత కలిగిన పెట్టుబడిదారులకు ఇవ్వనున్నట్లు ప్రకటించటంతో పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన వివరాల్లో పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం మూడోసారి పెట్టుబడిదారులకు మధ్యంతర డివిడెండ్ ఇవ్వటం గమనార్హం.

అయితే చాలా మంది పెట్టుబడిదారులు ప్రధానంగా ఎదురుచూస్తోంది దీనికి అర్హత పొందటం ఎలా అన్నదే. కంపెనీ అందిస్తున్న డివిడెండ్ కి అర్హత పొందటానికి రికార్డు తేదీగా ఫిబ్రవరి 13ను నిర్ణయించారు. అంటే ఎవరైనా ఇన్వెస్టర్లు ఈ కటాఫ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాల్లో కంపెనీ షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. కంపెనీ రికార్డు పుస్తకంలో పేర్లు ఉన్న పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.150 లాభం పొందటానికి అవకాశం ఉంటుంది.
గడచిన ఏడాది సైతం కంపెనీ తన పెట్టుబడిదారులకు నాలుగు సార్లు డివిడెండ్ రూపంలో రూ.770 చెల్లించింది. గత ఏడాది తొలిసారిగా ఫిబ్రవరి 16న కంపెనీ రూ.100 డివిడెండ్ చెల్లించగా చివరిగా ఆగస్టు 16న ఒక్కో షేరుపై రూ.300 డివిడెండ్ చెల్లించింది. ప్రస్తుతం ఇలాంటి డివిడెండ్ చెల్లించే కంపెనీల షేర్ల కోసం పెట్టుబడిదారులు నిరంతరం మార్కెట్ల తమ వేట కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 1 శాతానికి పైగా లాభపడి రూ.43,396.60 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
కంపెనీ వ్యాపారం..
పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. లోదుస్తులు, లాంజ్‌వేర్, సాక్స్‌ల తయారీ అండ్ రిటైలింగ్ వ్యాపారంలో కంపెనీ ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇండియాతో పాటుగా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, మాల్దీవులు, భూటాన్‌లలో జాకీ ఇంటర్నేషనల్ ప్రత్యేక లైసెన్స్ ద్వారా విక్రయాలు కొనసాగిస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications