హాస్పిటాలిటీ రంగ దిగ్గజం ఓయో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.623 కోట్ల లాభాన్ని అందుకుంది. దింతో ఓయో లాభాల పరంగా టాప్ భారతీయ స్టార్టప్‌గా అవతరించింది. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గురువారం స్వయంగా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఓయో ఐపీఓ ప్రారంభం ఆలస్యం అవ్వొచ్చు అని భావిస్తున్న సమయంలో ఈ వార్త వెలువడింది.

ఒక్కో షేరుకు ఓయో ఆదాయం: ఓయో ఆర్థిక సంవత్సరం 2025లో రూ.1132 కోట్ల EBITDA సాధించింది, గత సంవత్సరం ఇదే కాలంలో చూస్తే రూ.889 కోట్లుగా ఉంది. అంతేకాక గత సంవత్సరంతో పోలిస్తే 27 శాతం పెరుగుదలను సూచిస్తుంది. OYO షేరు ఆదాయం (EPS) FY25 లో రూ. 0.93 కి చేరుకుంటుందని అంచనా, అయితే FY24లో ఈ అంచనా రూ.0.36గా ఉంది. ఇంకా ఈసారి 158 శాతం పెరుగుదలను చూపుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఓయో గ్రాస్ బుకింగ్ వాల్యూ (GBV)లో 54 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే రూ.16,436 కోట్లకు పెరిగింది. దీని రెవెన్యూ రూ.6,463 కోట్లకు పెరిగి, గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసింది.
నాల్గవ త్రైమాసిక ఫలితాలు: 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఓయో GBV 126 శాతం పెరిగి రూ.6,379 కోట్లకు చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఆదాయం గత సంవత్సరం కంటే 41 శాతం పెరిగి రూ.1,872 కోట్లుగా ఉంది.
కంపెనీ విస్తరణ: గత 12 నెలల్లో భారతదేశం, సౌదీ అరేబియా, యుఎఇ ఇంకా సౌత్ ఈస్ట్ ఆసియా సహా వివిధ ప్రాంతాలలో 30కి పైగా సండే హోటళ్లను ప్రారంభించడం ద్వారా కంపెనీ ప్రీమియం ఆఫరింగ్ పెంచింది. ఓయోకి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 22,700 హోటళ్ళు ఇంకా 1,19,900 ఇల్లులు ఉన్నాయి.
ఆలస్యం కానున్న IPO: తాజాగా బ్లూమ్‌బెర్గ్ ఓయో హోటల్స్ అక్టోబర్‌లో IPOకి లిస్ట్ కావాలనే ప్లాన్ వాయిదా వేసినట్లు తెలిపింది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీ ఈ ఏడాది చివర్లో IPOను ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ ఈ ప్లాన్'తో విభేదించింది. ఆదాయం పెరిగే వరకు IPOను ఆలస్యం చేయాలని సాఫ్ట్‌బ్యాంక్ ఓయోను కోరింది. ఓయోలో జపాన్ పెట్టుబడి సంస్థకు 40% వాటా ఉండగా, వ్యవస్థాపకుడు అగర్వాల్‌కు 30% వాటా ఉంది.
ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్'తో OYO లాభాలను ఆర్జించడమే కాకుండా సరైన ప్లాన్ ఇంకా ఆవిష్కరణలతో ప్రయాణ రంగంలో కూడా పెద్ద ఎత్తున లాభాలను సాధించవచ్చని భారతీయ స్టార్టప్ ఏకోసిస్టంలో ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications