Bike Transport: ద్విచక్ర వాహనాల ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులకు చెక్.. గేమ్‌ ఛేంజర్‌గా Ovkay సేవలు

Bike Transport: ద్విచక్ర వాహనాలను రవాణా చేయడమంటే సుదీర్ఘ వెయిటింగ్, అధిక ఖర్చులు, డ్యామేజ్ ఆందోళనలతో కూడుకున్నది. ప్యాకర్స్ & మూవర్స్, రైల్వేలు వంటి సాంప్రదాయ షిప్పింగ్ పద్ధతులు కొంత మేర అసమర్థంగా, పారదర్శకత లోపంగా ఉంటాయి. తద్వారా వీటిపై కస్టమర్‌లు నిరాశ, అసంతృప్తిని కలిగి ఉన్నారు. అయితే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ Ovkay.. విప్లవాత్మకమైన ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవతో గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది.

Ovkay ద్వారా కస్టమర్‌లు తమ ఆర్డర్‌లను సులభంగా ఆన్‌లైన్‌లో ప్లేస్ చేయవచ్చు. పిక్-అప్ నుంచి ప్యాకింగ్ మరియు డెలివరీ వరకు ప్రతి పనీ సజావుగా నిర్వహించబడుతుంది. అవాంతరాలు లేని అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. అదనంగా రవాణా సమయంలో ఏదైనా నష్టం సంభవిస్తే Ovkay బాధ్యత తీసుకుంటుంది. కస్టమర్స్ ఆందోళనలను తగ్గించడానికి మరమ్మతు వాపసులను సైతం అందిస్తుంది. ఈ తరహా సమగ్ర భద్రత మరియు ట్రాకింగ్ సిస్టమ్ వినియోగదారుల్లో విశ్వాసాన్ని నింపుతుంది. Ovkay ప్రస్తుతం హైదరాబాద్‌లోని అత్యాధునిక ఇంక్యుబేటర్ అయిన T-Hub 2.0 నుంచి సేవలు అందిస్తోంది.

 ovkay

సౌకర్యాలతో రాజీ పడకుండా Ovkay ఎక్స్‌ప్రెస్ డెలివరీని అందించడంపై దృష్టి పెడుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా షిప్పింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు సురక్షితమైన పద్ధతిలో ద్విచక్ర వాహనాన్ని సత్వరం డెలివరీ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు చెన్నైలలో ఈ సంస్థ తన సేవలను అందిస్తోంది. రాబోయే రెండు నెలల్లో ముంబై, పూణే, కోల్‌కతా, విశాఖపట్నం, విజయవాడ మరియు రాయ్‌పూర్‌లకు విస్తరించే యోచనలో యాజమాన్యం ఉంది.

"కస్టమర్ ఫీడ్‌బ్యాక్ చాలా సానుకూలంగా ఉంది, చాలా మంది వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవను ప్రశంసించారు. మా కస్టమర్‌లకు వీలైనంత వేగంగా ద్విచక్ర వాహనాలను పంపడమే మా లక్ష్యం" అని Ovkay CEO అయిన జాన్ తేజా తెలిపారు. "సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా షిప్పింగ్ ఇబ్బందులను తొలగించగలమని, ద్విచక్ర వాహనాలను సులభంగా రవాణా చేయగలమని మేము నమ్ముతున్నాము" అని సంస్థ భాగస్వామి ప్రశాంత్ వెల్లడించారు. Ovkay గురించి మరిన్ని వివరాల కోసం www.ovkay.com వారి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 080 4710 3622కి కాల్ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+