SBI Gold Fund: మూడేళ్లలో అత్యధిక రాబడి అందించి ఎస్బీఐ గోల్డ్ ఫండ్...
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల కూడా భారీ రాబడి ఇచ్చింది. ఈక్విటీ ఫండ్ల కంటే ఎక్కవ లాభాలను అందించాయి. గత మూడేళ్ల ఎస్‌ఐపీ (SIP) రాబడులపై గోల్డ్ ఫండ్సా భారీ రాబడిని ఇచ్చాయి. వేల్యూ రీసెర్చ్ తాజా డేటా ప్రకారం ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్ ఏకంగా 44.11 శాతం వార్షిక ఎస్‌ఐపీ రిటర్న్స్ ఇచ్చి అగ్ర స్థానంలో నిలిచింది. యాక్సిస్ గోల్డ్ ఫండ్ 43.84 శాతంతో రెండో స్థానం దక్కించుకుంది.సాధారణంగా ఈక్విటీ స్మాల్‌క్యాప్ లేదా ఫార్మా ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారు మూడేళ్ల క్రితం నెలకు రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 3.6 లక్షలు డిపాజిట్ చేస్తే, వారి పెట్టుబడి విలువ సుమారు రూ. 4.90 లక్షలకు పెరిగింది.
అయితే అంతే రూ.10 వేల సిప్ ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా రూ. 6.59 లక్షలు, యాక్సిస్ గోల్డ్ ఫండ్‌లో పెట్టిన వారికి రూ. 6.57 లక్షలు లభించే అవకాశం ఉంది. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే గోల్డ్ ఫండ్లు దాదాపు రెట్టింపు రాబడిని అందించాయి. ఇందుకు ప్రధాన కారణం బంగారం ధరలు పెరగడమే. గోల్డ్ ఫండ్ల తర్వాత మూడో స్థానంలో నిలిచిన ఎస్‌బీఐ హెల్త్‌కేర్ అపార్చునిటీస్ ఫండ్ 21.36 శాతం రాబడి ఇచ్చింది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 21.36 శాతం, హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ 21.26 శాతం, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 21.17 శాతం రాబడులు అందించాయి.

టాప్ 10 జాబితాలోని ఈక్విటీ ఫండ్లన్నీ 19 శాతం నుంచి 21 శాతం మధ్య రాబడులు మాత్రమే ఇచ్చాయి. మూడేళ్ల కాలంలో గోల్డ్ ఫండ్లు ఆధిపత్యం చెలాయించినా, కేవలం గడిచిన ఒక్క ఏడాదిలోనే పరిస్థితులు మారిపోయాయి. సంవత్సర కాలంలో ఎస్‌ఐపీ రాబడిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఏకంగా 50.13 శాతం రిటర్న్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 42.06 శాతం, యాక్సిస్ గోల్డ్ ఫండ్ 38.45 శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడి కేవం ఈక్విటీ ఫండ్లలోనే కాకుండా డెట్ ఫండ్స్, బంగారం, వెండి లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడుల్లో వైవిధ్యం చూపడం బెటరని చెబుతున్నారు. అయితే వచ్చే కాలంలో కూడా గోల్డ్ ఫండ్స్ ఇవే రాబడి ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications