Flexi Cap Mutual Fund: వార్షికంగా 20 శాతం రాబడి ఇచ్చిన ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇదే..
నిర్దిష్ట మార్కెట్ క్యాప్ సెగ్మెంట్‌కు కట్టుబడి ఉండకుండా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను కోరుకునే పెట్టుబడిదారులకు ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌లు మొదటి ఎంపికగా ఉంటాయి. లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్ లేదా స్మాల్-క్యాప్ ఫండ్‌ల మాదిరిగా కాకుండా, ఫ్లెక్సీ-క్యాప్ స్కీమ్‌లు లార్జ్, మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ఫండ్ మేనేజర్లకు అవకాశం ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు గత 10 సంవత్సరాలలో సగటున 15 శాతం రాబడిని అందించాయి. తొమ్మిది ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లు తమ డైరెక్ట్ ప్లాన్‌ల ద్వారా 10-సంవత్సరాల సిప్ పెట్టుబడిపై 15 శాతం కంటే ఎక్కువ రాబడి అందించింది.
క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత పది సంవత్సరాల్లో సిప్ పెట్టుబడిపై 21.1 శాతం రాబడి అందించింది. నెలవారీ రూ.10,000 సిప్ చేస్తే దాని విలువ ఇప్పుడు రూ.36.5 లక్షలకు పెరిగింది.
HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 10 సంవత్సరాల్లో 18 శాతం రాబడితో సిప్ పెట్టుబడిపై రాబడి ఇచ్చింది. నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇవ్వుడు రూ.30.9 లక్షలు చేరింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17.8 శాతం రాబడి ఇచ్చింది. రూ.10 వేల సిప్ పెట్టుబడిని రూ. 30.5 లక్షలు చేసింది. ఈ ఫండ్ ప్రధాన హెల్డింగ్స్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా స్టాక్స్ ఉన్నాయి.

జేఎం ఫ్లెక్సిక్యాప్ ఫండ్ గత పదేళ్లలో 17..6 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ లో నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.30.3 లక్షలకు పెరిగాయి. ఎడెల్వీస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల్లో 16.4 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ లో నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.28.4 లక్షలకు పెరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15.5% రాబడి ఇచ్చింది. ఇందులో రూ.10 వేల సిప్ పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.27 లక్షలకు పెరుగుతోంది. పీజీఐఎ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15.4 శాతం రాబడి ఇచ్చింది. ఇందులో రూ.10 వేల సిప్ పెట్టుబడి పెడితే దాని విలువ రూ.26.9 లక్షలకు చేరింది.
హెచ్ఎస్పీసీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత పదేళ్లలో 15.4 శాతం రాబడి ఇచ్చింది. రూ.10 వేల సిప్ పెట్టుబడి రూ. 26.7 లక్షలకు చేరింది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 15.2 శాతం రాబడి ఇచ్చింది. ఇందులో రూ.10 వేల సిప్ పెట్టుబడి పెడితే దాని విలువ రూ. 26.5 లక్షలకు పెరిగేది. అయితే మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుందని గమనించాలి. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications