Prices: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. భారీగా పెరిగిన బియ్యం, చికెన్, కోడి గుడ్డు ధరలు..!
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతోన్నాయి. కూరగాయల ధరలు, మాంస ధరలు, బియ్యం ధరలు పెరుగడంతో సామాన్యుడిపై భారం పడుతోంది. వంట నూనె ధరల కూడా భారీగానే పెరిగాయి. ఇక బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. తెలంగాణల భారీ వరి పండిస్తున్నప్పటికీ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత రెండున్నర నెలల కాలంలోనే కేజీ సన్న బియ్యం ధర రూ.10 నుంచి రూ.12 వరకు పెరిగింది. నిత్యం వాడే సోనా మసూరీ, బిపిటి, ఐఆర్-64 వంటి రకాల క్వింటాల్ ధర మార్కెట్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గుతుందనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమ నిల్వలకు పాల్పడటం వల్లనే ఈ ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
అయితే తెలంగాణల సన్న వడ్ల కంటే.. దొడ్లు వడ్లు ఎక్కు పండిస్తున్నారని.. కానీ తినేటప్పుడు సన్న బియ్యం తింటున్నారని చెబుతున్నారు. అందుకే సన్న బియ్యానికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. బియ్యంతో పాటు చికెన్, కోడి గుడ్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి. నెల క్రితం వరకు ఒక్కో కోడి గుడ్డు ధర రూ.6 ఉండేది. నెల రోజుల్లో కోడి గుడ్డు ధరరూ.8.50కు చేరడంతో పేద, గిరిజన కుటుంబాలు కొనుగోలు చేయడం తగ్గించారు. డజన్ గుడ్లు తీసుకునేవారు అరడజన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక సండే వచ్చిందంటే.. చాలా మందికి ముక్క లేనిదే బుక్కు దిగదు. చాలా మంది సండే రాగానే చికెన్ కొనుగోలు చేస్తారు

అయితే చికెన్ ధర భారీగా పెరిగింది. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ. 360 నుంచి రూ.380 పలుకుతోంది. దీంతో కిలో చికెన్ తెచ్చుకునే వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇక మటన్ ధర కిలో రూ.500 నుంచి రూ.1000 పలుకుంది. డబ్బున్నవారు తప్పా సామాన్యులు మటన కొనలేని స్థితికి చేరుకున్నారు. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. టమాటా కేజీ రూ. 40 నుంచి రూ. 60 పలుకుతుండగా.. పచ్చిమిర్చి కిలో రూ. 40 నుంచి రూ. 60, ఉల్లిపాయలు కేజీ రూ. 40 నుంచి రూ. 55, బెండకాయ కేజీ 40 నుంచి రూ.50, వంకాయ కిలో రూ.40 నుంచి 50 పలుకుతోంది. క్యారెట్ కేజీ రూ. 50 నుంచి రూ. 60 పలుకుతుంది.
వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత ఆరు నెలల్లో సన్ ప్లవర్ ఆయిల్ ధర పెరిగింది. ప్రస్తుతం లీటర్ పొద్దుతిరుడు నూనె ధర రూ.160 నుంచి రూ.175 పలుకుతోంది. జూన్ లో కూడా ఆహార పదార్థాల ధరలు భారీగా ఉన్నాయి. అందుకే ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అలాగే ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications