ఆటో దిగ్గజం మారుతి సుజుకీ 63,493 యూనిట్ల పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడల్స్‌లో మోటార్ జనరేటర్ యూనిట్‌ను సరిచేయడంలో భాగంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. జనవరి 1, 2019 నుంచి నవంబర్ 21, 2019 లోపు తయారైన ఈ కార్లలో జనరేటర్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు పేర్కొంది. వీటిని పరిశీలించి ఉచితంగా మరమ్మత్తు చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ కార్లన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 21 మధ్యలో ఉత్పత్తి అయినవని తెలిపింది. వినియోగదారుల ప్రయోజనార్థం, సమస్య ఉన్న కార్లన్నింటినీ వెనక్కి తెప్పిస్తున్నామని, అందులో బాగున్న వాటిని తిరిగి ఇచ్చేస్తామని పేర్కొంది. సమస్య ఉన్న కార్లలో ఉచితంగా మరో భాగాన్ని అమర్చనున్నట్లు తెలిపింది. తమ డీలర్లు శుక్రవారం నుంచి వినియోగదారులను సంప్రదించడం మొదలు పెట్టారని పేర్కొంది.

అంతర్జాతీయ సరఫరా సంస్థ చేసిన విడిభాగాల్లో లోపాలు ఉండే అవకాశం ఉండటంతో రీకాల్ చేస్తున్నామని తెలిపింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మారుతీ సుజుకీ డీలర్ల వద్ద ఉచితంగా లోపాలను గుర్తించి కొత్త వాటిని భర్తీ చేస్తామని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications