పని ఒత్తిడితో 500 మంది PSB అధికారులు ఆత్మహత్య.. 10 ఏళ్ల నుంచి నిశ్శబ్దంగా బ్యాంకింగ్ రంగ సంక్షోభం

భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా లేఆఫ్స్ నడుస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఓ రకమైన ఆందోళన నెలకొంది. ఇక మరికొన్ని చోట్ల వర్క్ ఫ్రెషర్ తో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు తమ జీవితాలను చాలించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక్క రంగంలోనే కాకండా.. టెక్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (BFSI) వంటి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల పని ఒత్తిడి చాలా దారుణంగా ఉంది. దీంతో వారు ఆత్మహత్య చేసుకోవడంతప్ప వేరే గత్యంతరం లేదని డిసైడ్ అవుతున్నారు. తాజాగా ఈ ఆత్మహత్యలపై సంచలన కథనం వెలుగులోకి వచ్చింది.

గత దశాబ్దంలో 500 మందికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు ఆత్మహత్య చేసుకున్నారన్న గణాంకాలు ఇప్పుడు అందర్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ సంఘటనలు గమనించపోవడం, మౌనంగా ఉండడం, బాధితులను వ్యక్తిగతంగా తప్పుపట్టడం అనేది వ్యవస్థలో ఉన్న లోపాలను మరింతగా బయటకు తీసుకువస్తోంది. ప్రముఖ బ్యాంకింగ్ విశ్లేషకుడు తమాల్ బండ్యోపాధ్యాయ్ ఇటీవల తన కాలమ్‌లో దీనిపై లోతుగా అధ్యయనం చేశారు. ఆయన ఈ విషాదకర ఘటనలపై పేర్కొన్న కొన్ని ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.

Stress Targets Isolation Public Bank Officers Banking on Pressure public sector bank suicides PSB officer mental health Indian bank employee suicide workplace stress in banks PSB staff suicide data banking sector mental health crisis suicide among bank officers India bank job stress India public bank workload pressure government bank staff burnout employee mental health PSBs India bank suicide news overworked PSB staff PSB bank udyogi aathmahatyalu prabhutva bankullo ottidi public sector bank udyogula ottidi banking udyogullo manasika aarogyam udyoga ottidi karananga aathmahatya bank udyogula maranalu PSB udyogula aathmahatyalu prabhutva bankullo pani ottidi

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడే పరిస్థితిలోకి వచ్చాయి. రోజురోజుకీ పెరుగుతున్న టార్గెట్లు ఉద్యోగులను నిద్రపోనివ్వడం లేదు. ఒక్కో బ్రాంచ్‌కి నాలుగు నుంచి ఆరుగురు మాత్రమే మిగిలిపోవడం వల్ల, వాళ్లందరూ రోజుకు 12-14 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో వాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

ఇక EASE రిఫామ్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను భారీగా తగ్గించింది.దీంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలలో ఉద్యోగుల కొరత పెరిగింది. ఇదంతా బ్యాంకింగ్ సేవల నాణ్యతను కాకుండా.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. బ్యాంకుల్లో తక్కువ మంది మిగలడంతో అధిక భాద్యతలు, ఒత్తిడితో ఉద్యోగులు నిత్యం సతమతమవుతున్నారు. బ్యాంక్ జాబ్ అందరూ ఎగిరి గంతేస్తుంటారు. అయితే అందులో దిగిని వారికి మాత్రం పని ఒత్తిడి చుక్కలు చూపిస్తోంది.

ఉద్యోగి ఎప్పుడూ తన పనితీరు పై విజిలెన్స్, ఇంటర్నల్ ఆడిట్, బ్యాంక్ ఇన్‌స్పెక్షన్ వంటి వ్యవహారాలతో కూడిన నిఘా పర్యవేక్షణలో ఉంటాడు. ఇది ఉద్యోగుల్లో భయాన్ని, ఆత్మవిశ్వాసం కోల్పోవడాన్ని కలిగిస్తోంది.ఈ ఒత్తిడిని వ్యక్తిగత సమస్యగా చూస్తూ, సంస్థాత్మక మార్పుల వైపు దృష్టి పెట్టని వ్యవస్థలో మానసిక ఆరోగ్యపాలవుతున్నారు.అయితే దీనిపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నా.. అవి వాస్తవంలో ఉపయోగపడేలా కనిపించడం లేదు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు భారత ఆర్థిక వ్యవస్థకు హార్ట్ లాంటివి. అలాంటి రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇలాంటి ఒత్తిళ్లతో పనిచేస్తే ముందు ముందు ప్రమాదకర సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో మానవీయతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్యాల పేరుతో ఉద్యోగులను మానసికంగా చంపేయకూడదని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల పూణేలోని ప్రభుత్వ బ్యాంకులో ఒక చీఫ్ మేనేజర్ పని ఒత్తిడిని కారణంగా పేర్కొంటూ ఆత్మహత్య చేసుకోవడం ఈ సమస్యకు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రకారం...బ్యాంకులలో సిబ్బంది కొరత వల్ల అధికారులు రోజుకు 12-14 గంటలు పనిచేయాల్సి వస్తోంది. పేలవమైన పనితీరు సమీక్షలు, ఏకపక్ష బదిలీలు ఉద్యోగులను మానసికంగా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి.

CIEL HR సర్వీసెస్ నివేదిక ప్రకారం.. BFSI, కన్సల్టింగ్, అకౌంటింగ్ రంగాలలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు వారానికి 50 గంటలకు పైగా పని చేస్తున్నారు. 38 శాతం మంది ఉద్యోగులు బర్నౌట్ వల్ల కొత్త ఉద్యోగం వెతుకుతున్నారు.అయితే మానసిక ఒత్తిడి మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను వ్యక్తిగతంగా కాకుండా, వ్యవస్థాపితంగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు కనిపిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+