జన్ ధన్ అకౌంట్లలో ఉన్న డబ్బు ఏమవుతుంది ? మొత్తం 54.03 కోట్లలో 11.30 కోట్ల ఖాతాలు ఇన్‌యాక్టివ్..
కరోనా లాక్ డౌన్ ముందు ఎస్బిఐ బ్యాంక్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనే పేరుతో జీరో అకౌంట్స్ అందించింది. ఈ అకౌంట్స్ ముఖ్య ఉద్దేశం అందరికి ఆర్ధిక సేవలు(బ్యాంకింగ్, లోన్స్ సహా ఇతర సర్వీసెస్) అందుబాటులోకి తేవడం. అలాగే కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ అకౌంట్లలో అర్హులైన వారికీ కేంద్రం కొంత ఆర్ధిక సహాయం జమ చేసింది. బ్యాంకింగ్ సేవలు ప్రతిఒక్కరికి అందుబాటులోకి తెచ్చేలా ఇంకా లోన్ సదుపాయం, పెన్షన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేసినందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రవేశపెట్టారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన మొత్తం 54.03 కోట్ల అకౌంట్లలో 11.30 కోట్ల అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయని, వీటిలో ఉన్న మొత్తం రూ.14, 750.27 కోట్లు అని తాజాగా ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.

2017 సంవత్సరంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఇన్‌యాక్టివ్ అకౌంట్స్ సంఖ్య 39.62 శాతం ఉండగా, ప్రభుత్వ కృషి వల్ల నవంబర్ 24 నాటికి 20.91 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. జన్‌ధన్ అకౌంట్స్ ప్రారంభించినప్పటి నుంచి ఓపెన్ చేసిన అకౌంట్స్, ప్రస్తుతం ఉన్న ఇన్‌యాక్టివ్ అకౌంట్స్ పై రాష్ట్రాల వారీగా సమాచారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కోరగా దీనిపై పంకజ్ చౌదరి స్పందిస్తూ 20 నవంబర్ 2024 వరకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద మొత్తం 54.3 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేయగా వీటిలో 11.30 కోట్ల అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి అని తెలిపారు. కేంద్ర మంత్రి రాష్ట్రాల వారీగా ఇచ్చిన డేటా ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 9.63 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేయాగా వీటిలో దాదాపు 2.34 కోట్ల అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయి.
అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో తెరిచిన అకౌంట్స్ సంఖ్య 5.25 కోట్లు కాగా, ఇన్‌యాక్టివ్ అకౌంట్స్ సంఖ్య 78.5 లక్షలు. పంజక్ చౌదరి ఇచ్చిన డేటా ప్రకారం, ఇన్‌యాక్టివ్ అకౌంట్స్ లో మొత్తం బ్యాలెన్స్ రూ.14,750.27 కోట్లు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఈ సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి ట్రాన్సక్షన్స్ చేయని అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌గా పరిగణించబడుతున్నాయని ఆయన అన్నారు.
ఆక్టీవ్ అకౌంట్స్ శాతాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు బ్యాంకులు కృషి చేస్తున్నాయని,అలాగే ప్రభుత్వం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ట్రాన్సక్షన్ చేయని అకౌంట్స్ లేదా డిపాజిట్లను ఏటా సమీక్షించాలని, ఈ ఖాతాలు లేదా డిపాజిట్ల కస్టమర్లను గుర్తించాలని ఆర్‌బిఐ బ్యాంకులకు సూచించింది.


Click it and Unblock the Notifications