Multibagger Stock: ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖపై భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక కొత్త రైల్వే ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. ఈ కారణంగా రంగంలోని షేర్లు పేలుడు రాబడిని ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.
రైల్వే రంగంలోని ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈరోజు మార్కట్లో స్టాక్ ధర 2 శాతం మేర లాభపడి రూ.97.97 రేటు వద్ద బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. అయితే ఈ షేర్ల దూకుడు వెనుక ఒక కారణం ఉంది. ఈ కంపెనీకి మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రూ.37 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ వార్తలో షేర్లు రెండు ట్రేడింగ్ సెషన్లలో రాకెట్ దూకుడును ప్రదర్శిస్తున్నాయి.

ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు గత వారం రోజుల్లో 10 శాతం మేర లాభపడ్డాయి. గడచిన నెలలో కంపెనీ షేర్లు 15.18 శాతం మేర పెరిగాయి. అలాగే ఏడాది ప్రాతిపధికన స్టాక్ ధర 25 శాతానికిపైగా పెరిగింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారుల విలువ రూ.4.57 లక్షలకు చేరుకుంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.33.50 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.127.50గా కొనసాగుతోంది.
1996లో కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయబడింది. ఇక్కడ ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా నష్టాలను నమోదు చేయలేదు. ఇది రైల్వేలకు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తుంటుంది. 30 ఏళ్ల నుంచి కంపెనీ ఈ వ్యాపారంలో ఉంది. ప్రధానంగా వ్యాగన్లు, కోచ్ లు, సీట్లు, బెర్తులు, బోగీలు, రైల్వే బాత్ రూమ్ డోర్లు, రైల్వే బోగీలను కలిపి ఉంచే కపుల్స్ వంటి ఉత్పత్తులను కంపెనీ అందిస్తోంది.


Click it and Unblock the Notifications