Adani News: సిమెంట్ వ్యాపారంలో కొన్ని కీలక కంపెనీలను హస్తగతం చేసుకున్న తర్వాత అదానీ సిమెంట్స్ దేశంలో పెద్ద ఆటగాడిగా మారిపోయింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దూసుకుపోతున్న అదానీ అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్ కంపెనీలను భారీ మెుత్తం వెచ్చించి కొనుగోలు చేసింన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓరియంట్ సిమెంట్ ప్రమోటర్ సికె బిర్లా తమ కంపెనీలో వాటాలను విక్రయించేందుకు గౌతమ్ అదానీని సంప్రదించారు. ఈ వార్తలు బయటకు రావటంతో నేడు మార్కెట్లో ఓరియంట్ సిమెంట్ షేర్లు 13% పెరిగి పెట్టుబడిదారులకు తుఫాను రాబడులను అందించింది. మీడియా కథనాలతో స్టాక్ తన 52 వారాల గరిష్ఠమైన రూ.214.95ను తాకింది. ఉదయం 11.53 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 9.78 శాతం లాభంతో రూ.207.60 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఈ డీల్ గురించి చర్చించేందుకు బిర్లా, అదానీ గ్రూప్ సీనియర్ అధికారులు చర్చిందేంకు సమావేశమైనట్లు ప్రఖ్యాత వార్తా సంస్థ నివేదించింది. నివేదిక ప్రకారం గత కొన్ని నెలలుగా అదానీతో పెట్టుబడిపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడైంది. ప్రస్తుతం అదానీ సిమెంట్ మొత్తం సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 110 మిలియన్ టన్నులుగా ఉంది. దీంతో ఈ రంగంలో కంపెనీ దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా ఎదిగింది.
ఇక సికె బిర్లా గ్రూప్ సంగతి మాట్లాడుకుంటే.. దీనికి ఆటో యాక్సెసరీస్ ఉత్పత్తులు, భవన నిర్మాణ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, సిమెంట్, పేపర్, ఫ్యాన్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు వంటి విభిన్న పరిశ్రమల్లో వ్యాపారాలు ఉన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రమోటర్లు సిమెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కంపెనీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లో కూడా మైనర్ ఉనికిని కలిగి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications