ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ బుధవారం ఓపెన్ అయింది. ముంబైకి చెందిన IT సొల్యూషన్స్ ప్రొవైడర్, దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌కు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 64.43 కోట్లను సేకరించింది. ఓరియంట్ టెక్నాలజీస్ IPO కోసం ప్రైస్ బ్యాండ్ రూ10 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.195 నుంచి రూ.206గా నిర్ణయించారు.
ఓరియంట్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB) 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆఫర్‌లో 35 శాతం కేటాయించారు. ఓరియంట్ టెక్నాలజీస్ IPO కోసం షేర్ల కేటాయింపు ఆగస్టు 26 సోమవారం నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. షేర్లు రాని వారికి ఆగస్ట్ 27వ తేదీ మంగళవారం నుంచి రీఫండ్‌లు ప్రాసెస్ చేస్తారు.

రీఫండ్ జరిగిన రోజునే షేర్లు కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఓరియంట్ టెక్నాలజీస్ షేర్లు ఆగస్ట్ 29న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓరియంట్ టెక్నాలజీస్ కంపెనీని 1997లో స్థాపించారు. ఈ కంపెనీ IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, IT ఎనేబుల్డ్ సర్వీసెస్ (ITES), క్లౌడ్, డేటా మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి Dell, Fortinet, Nutanix క్లైంట్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓరియంట్ టెక్నాలజీస్ అందించే ఉత్పత్తి, సేవలలో డేటా సెంటర్ సొల్యూషన్స్ మరియు ఎండ్-యూజర్ కంప్యూటింగ్ ఉన్నాయి. FY24లో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 12% పెరిగి రూ.603 కోట్లకు చేరుకుంది. ఎలారా క్యాపిటల్ IPO కోసం ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications