Multibagger Stock: చిన్న స్టాక్స్ లో లాభాలు వస్తాయా అని అనుమానంతో కొంత మంచి షేర్లను పక్కకు పెడుతుంటారు. అదే సమయంలో చాలా తక్కువ విలువ కలిగిన కొన్ని స్టాక్ లలో ఇన్వెస్టర్లు ఫండమెంటల్స్, కంపెనీ పనితీరు వంటివి గమనించకుండా ఎవరో చెప్పారని కొన్ని సార్లు పెట్టుబడులు పెట్టి బొక్కబోర్లా పడుతుంటారు. కానీ.. కొంత రీసెర్చ్ చేసిన తరువాత కొనే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ అందించాయి. మీరు కూడా మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సరైన రీసెర్చ్ చేసి షేర్లను ఎంచుకోవటం ఉత్తమం.
గత ఏడాదిలో.. అనేక స్మాల్‌క్యాప్ స్టాక్‌లు పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. పెట్టుబడిదారులకు 1200 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించిన అటువంటి స్టాక్ గురించి ఈ రోజు మేము మీకు తెలియజేస్తాము. ప్రఖ్యాత ఇన్వెస్టర్ పొరింజు వెలియత్(Porinju Veliyatha) కూడా ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టారు.

లాభాల్లో దూసుకుపోతూ..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఓరియంట్ బెల్(Orient Bell) షేర్ గురించే. ఇది స్మాల్‌క్యాప్ సెగ్మెంట్ కు చెందిన ఒక స్టాక్. ఓరియంట్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు అనతి కాలంలోనే బంపర్ రిటర్న్ అందించింది. ఈ క్రమంలో షేరు ధర రూ.53.75 స్థాయి నుంచి పెరుగుతూనే ఉంది. ఈ రోజు NSEలో ఉదయం 11.25 నిమిషాల సమయంలో స్టాక్ 10 శాతం కంటే ఎక్కువ లాభపడి రూ.765 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలాఖరులో క్రిసిల్ కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను సవరించడంతో స్టాక్ మార్కెట్లో రాకెట్ లాగా దూసుకుపోతోంది.

రెండేళ్లలో కాలంలో రిటర్న్స్..
గత వారంలో కంపెనీ షేరు 20 శాతం ఎగబాకింది. ఈ సమయంలో కంపెనీ స్టాక్ రూ. 120.95 పెరిగింది. ఇది కాకుండా గడచిన ఏడాది సమయాన్ని పరిశీలించినట్లయితే.. ఈ సమయంలో కంపెనీ షేర్లలో 104.53 శాతం పెరిగింది. ఈ సమయంలో కంపెనీ షేరు రూ.358.75 పెరిగింది. నేడు కంపెనీ షేరు మార్కెట్‌లో రూ.765 స్థాయిలో ట్రేడవుతోంది. కంపెనీ షేరు 29 మే 2020న NSEలో ఒక్కొక్కటి రూ. 53.75గా ఉంది. అంటే ఈ రెండు సంవత్సరాల్లో స్టాక్ 14 రెట్లకు పైగా పెరిగింది. అదే ఐదేళ్ల కాలాన్ని గమనించినట్లయితే.. షేర్ 150.79 శాతం లాభాన్ని అందించింది.

పెట్టుబడిపై రాబడి ఇలా..
ఒక ఇన్వెస్టర్ గత వారం సెషన్ ప్రారంభంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. అప్పుడు దాని విలువ 1.20 లక్షలకు పైగా ఉండేది. 2022 కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక పెట్టుబడిదారుడు ఈ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు దాని విలువ రూ. 2.05 లక్షలకు చేరుకునేది. అదే విధంగా.. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు అవి రూ. 2.25 లక్షలు అయి ఉండేది. రెండేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లో లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ ఈ రోజు రూ.14 లక్షలకు పైగానే ఉండేది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications