IPO News: డబ్బులు డబుల్ చేసే చివరి అవకశం.. గ్రే మార్కెట్లో అద్భుత స్పందన..
IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గత కొన్ని నెలలుగా ఐపీవోల వరద కొనసాగుతోంది. అయితే వీటిలో దాదాపు 90 శాతం ఐపీవో లిస్టింగ్స్ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చాయి. లిస్టింగ్ సమయంలోనే ఊహించని లాభాలను అందించాయి.
ఇదే క్రమంలో ఒరియానా పవర్ ఎన్ఎస్ఈ ఐపీవో దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. ఆగస్టు 1న తెరవబడిన ఐపీవో.. ఆగస్టు 3న ముగియనుంది. అయితే ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజునే పెట్టుబడిదారుల సంపద మొత్తాన్ని రెట్టింపు చేస్తుందని భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఇంధన రంగంలో వ్యాపారం చేస్తున్న ఒరియానా పవర్ IPO ఇష్యూ ధర ఈక్విటీ ఒక్కో షేరుకు రూ.115 నుంచి రూ.118 వరకు నిర్ణయించబడింది. ప్రస్తుతం కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో ప్రీమియం రూ.105 వరకు చూపుతోంది. దీంతో ఒరియానా పవర్ షేర్ల లిస్టింగ్ ధర ఒక్కో షేరుకు రూ.221 ఉండవచ్చని అంచనా వేయబడింది. ఇది ఇష్యూ ధరపై దాదాపు 88% ప్రీమియం. ఈ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల భాగం 22 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది.
ఒరియానా పవర్ తాజా ఐపీవో ద్వారా సుమారు రూ.60 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇందులో పూర్తిగా 50.5 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. ఈ ఐపీవోకు లీడ్ మేనేజర్ కార్పొరేట్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. అదే సమయంలో స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీవోకు రిజిస్ట్రార్‌గా నియమించబడింది.

రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పాల్గొనాలంటే ఒక లాట్ అంటే కనీసం 1200 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ కోసం కనీసం రూ.1,41,600 పెట్టుబడిగా పెట్టాలి. ఒరియానా పవర్ షేర్ల కేటాయింపు ఆగస్టు 8 మంగళవారం జరుగుతుంది. ఈ క్రమంలో షేర్లు కేటాయించబడని ఇన్వెస్టర్లకు ఆగస్టు 9న డబ్బు వాపసు చేయబడుతుంది. ఇక లిస్టింగ్ విషయానికి వస్తే కంపెనీ షేర్లు ఆగస్టు 11న మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications