ఏఐ దెబ్బకు ఆగని లేఆప్స్.. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో టాప్ కంపెనీ
Oracle Layoffs: గ్లోబల్ టెక్ కంపెనీలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఖర్చు తగ్గింపులు చేసుకుంటూ భవిష్యత్తు మీద తమ దృష్టిని పెడుతున్నాయి. AI తో వ్యాపారాన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కూడా తొలగిస్తున్నాయి.మహమ్మారి పోయినా ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతూనే ఉంది. AI సేవలు ఖరీదైనవి కాబట్టి, దీని నిర్వహణ కోసం అధిక ఖర్చులను భరించవలసి వస్తోంది. దీని కోసం ఉద్యోగులను కూడా తొలగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో, పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు, తొలగింపులు చేపడుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో కంపెనీలే లేఆప్స్ చేపట్టాయి. తాజాగా వీటి సరసన ఒరాకిల్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ తన అత్యంత శక్తివంతమైన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కృత్రిమ మేధస్సు (AI) మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే భారీ ఖర్చులను తట్టుకోవడమే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఇటీవల తొలగించబడిన ఉద్యోగులలో చాలా మంది పనితీరు సంబంధిత కారణాల వల్ల తొలగించబడినట్లు కనిపిస్తోంది. ఇంతలో ఉద్యోగులను ఓ వైపు తీసేస్తున్న ఒరాకిల్ ఈ విభాగంలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కొనసాగిస్తోంది. ఏఐకి పెద్ద పీట వేస్తునన్న కంపెనీ 500 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

సియాటిల్-ఏరియా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుండి 150 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీని గురించి ఒరాకిల్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వార్తను టెక్ న్యూస్ మ్యాగజైన్ డేటాసెంటర్ డైనమిక్స్ ధృవీకరించి ప్రచురించింది.AI పెరుగుదల, క్లౌడ్ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఒరాకిల్ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి, దీనితో ఒరాకిల్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ మొదటిసారిగా ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
అయితే తాజాగా కంపెనీ 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.అదనంగా, ఒరాకిల్ గత సంవత్సరం తన ప్రధాన కార్యాలయాన్ని నాష్‌విల్లేకు మారుస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన కొంతమంది ఉద్యోగుల తొలగింపులు కూడా జరిగాయి.మైక్రోసాఫ్ట్ కార్ప్ ఈ సంవత్సరం 15,000 ఉద్యోగాలను తగ్గించింది.టీసీఎస్,గూగుల్, అమెజాన్, మెటా వంటి పలు దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి.


Click it and Unblock the Notifications