ప్రపంచ ఐటీ రంగంలో మరోసారి లేఆఫ్స్ (layoffs) భయం మొదలైంది. ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్స్‌లో తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలోని ఆస్టిన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ భారీ తొలగింపులకు శ్రీకారం చుట్టింది.

ఒక్క ఈమెయిల్‌తో ముగిసిన ప్రస్థానం
మంగళవారం ఉదయం నిద్రలేవగానే చాలామంది ఉద్యోగులకు ఒరాకిల్ నుండి ఒక మెయిల్ వచ్చింది. "సంస్థ అవసరాల దృష్ట్యా మీ రోల్‌ను తొలగిస్తున్నాం.. ఈరోజే మీ చివరి పనిదినం" అంటూ వచ్చిన ఆ మెయిల్ చూసి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా ఇలా సడన్‌గా తీసేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్యోగుల కంప్యూటర్ యాక్సెస్, ఈమెయిల్ , ఫైల్స్ వెంటనే డియాక్టివేట్ చేస్తామని కూడా సంస్థ స్పష్టం చేసింది.
సెవరెన్స్ ప్యాకేజీ వివరాలు
ఉద్యోగం కోల్పోయిన వారికి ఇచ్చే సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో ఒరాకిల్ ఇతర టెక్ కంపెనీల కంటే వెనుకబడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- అమెరికాలోని ఉద్యోగులకు 4 వారాల బేసిక్ శాలరీతో పాటు, పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక వారం చొప్పున అదనపు జీతం ఇస్తున్నారు. ఇది గరిష్టంగా 26 వారాల వరకు ఉంటుంది.
- అయితే, గతంలో మెటా (Meta) 16 వారాల జీతంతో పాటు 6 నెలల హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది.
- జాక్ డోర్సీకి చెందిన బ్లాక్ (Block) సంస్థ ఏకంగా 20 వారాల జీతం , 5,000 డాలర్ల స్టైపెండ్ ఇచ్చి ఆదుకుంది. వాటితో పోలిస్తే ఒరాకిల్ ఇస్తున్న ప్యాకేజీ చాలా తక్కువని నిపుణులు అంటున్నారు.
భారత్‌పై ప్రభావం , భవిష్యత్తు
భారత్‌లో ఒరాకిల్‌కు పెద్ద ఎత్తున కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు 12,000 మందిని తీసేయడం వల్ల ఇక్కడి ఐటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా, వచ్చే నెలలో మరో రౌండ్ లేఆఫ్స్ ఉండవచ్చని కంపెనీ హెచ్ఆర్ వర్గాల సమాచారం. అంటే మరికొంత మంది ఉద్యోగుల తలరాతలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.
టెక్ రంగంలో లేఆఫ్స్ (layoffs) అనేవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినప్పటికీ, ఒరాకిల్ వంటి పెద్ద సంస్థ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను తీసేయడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం , ఆర్థికంగా ముందే సిద్ధపడటం ఇప్పుడు చాలా అవసరం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications