కరోనా మహమ్మారి, ట్రేడ్ వార్ సహా వివిధ కారణాలతో చైనాకు చెందిన వివిధ సంస్థలు అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొద్దికాలంలోనే ఎదిగిన బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్ యాప్‌ను ఇప్పటికే భారత్ నిషేధించింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో టిక్‌టాక్ విక్రయానికి గడువును నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించారు. దీంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ వాటాల విక్రయానికి అమెరికా, భారత్ సహా వివిధ దేశాల్లోని దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అమెరికా, న్యూజిలాండ్ టిక్‌టాక్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతుండగా, భారత్ కార్యకలాపాలపై రిలయన్స్‌తో చర్చిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కొనుగోలు రేసులోకి ఒరాకిల్ వచ్చింది.

రేసులోకి ఒరాకిల్
యూఎస్ వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ట్రంప్ టిక్‌టాక్‌ను ఉపసంహరించుకోవాలని బైట్ డ్యాన్స్‌ను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడి వాదనతో చాలామంది ఏకీభవిస్తున్నారు. కో-ఫౌండర్, చైర్మన్ లారీ ఎలిశన్ కూడా దీనిని సమర్థించారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే రేసులో ఉంది. జనరల్ అట్లాంటిక్, సీక్వియో కేపిటల్ సహా ఒరాకిల్ కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇందుకు పలు సంస్థలు కలిసి పని చేస్తోంది. దీనిపై బైట్ డ్యాన్స్, టిక్ టాక్, ఒరాకిల్, జనరల్ అట్లాంటిక్, సీక్వియో కేపిటల్ స్పందించాల్సి ఉంది.

ఎగిసిన మార్కెట్
టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఒరాకిల్ కూడా ఆసక్తి కనబరుస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు 3.4 శాతం ఎగిసి మార్కెట్ క్యాప్ 171 బిలిలియన్ డాలర్లు పెరిగింది. అమెరికా టిక్ టాక్ కొనుగోలుకు ట్విట్టర్ కూడా ఆసక్తి చూపిస్తోంది. టిక్ టాక్‌ను కొనుగోలు చేసే సంస్థ అమెరికా ప్రభుత్వానికి గణనీయమైన భాగం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ చెప్పారు. టిక్‌టాక్‌తో పాటు టెన్సెంట్ వీచాట్‌పై కూడా ట్రంప్ చర్యలకు మొగ్గు చూపుతున్నారు.

ట్రంప్ ఒకే...
టిక్‌టాక్‌ను ఒరాకిల్ తీసుకునే అంశంపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఒరాకిల్ చాలా బెస్ట్ కంపెనీ అని, ఇది చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ యాప్‌ను కొనుగోలు చేయవచ్చునని అన్నారు. అంటే ఓ విధంగా ట్రంప్ దీనికి ఒకే చెప్పారని భావించవచ్చు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతుండగా పోటీగా ఒరాకిల్ రేసులోకి రావడం, ట్రంప్ అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications