హైదరాబాద్ కంపెనీకి కరోనా ట్యాబ్లెట్ తయారీకి అనుమతి, అందుబాటులో ధరలు..

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా మార్కెట్లోకి యాంటీవైరల్ ఔషధం ఫెవిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్స్‌ను విడుదల చేసింది. ఫెవిపిరవిర్ ఏఐపీ తయారీకి అనుబంధ సంస్థ ఆపిట్రెక్స్ లేబోరేటరీస్, ఫెవికోవిడ్ 200 బ్రాండ్‌తో వీటిని విక్రయించేందుకు ఆప్టిమస్‌కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్లు కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని యూనిట్‌లో ఈ ఔషధాలను ఉత్పత్తి చేస్తుంది.

డీసీజీఐ అనుమతి

డీసీజీఐ అనుమతి

తమకు డీసీజీఐ నుండి అనుమతి వచ్చిందని, తమ అనుబంధ సంస్థ ఆపిట్రెక్స్‌ లేబరేటరీ ద్వారా ఫెవిపిరవర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్(ఏపీఐ) తయారీకోసం అనుమతుల్ని అందుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు మోస్తరు నుంచి మధ్యస్తంగా కోవిడ్ 19 లక్షణాలు కలిగిన రోగులలో చికిత్స కోసం ఆప్టిమస్ ఫార్మా ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా తమ యాంటీవైరల్‌ డ్రగ్ ఫెవిపిరవిర్ 200ఎంజీ ట్యాబ్లెట్ల తయారీ, మార్కెటింగ్‌కు సైతం అనుమతులను అందుకున్నట్లు తెలిపారు. కంపెనీ తమ అంతర్గత సామర్థ్యంపై ఆధారపడి యాక్టివ్ ఫార్మా స్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ)ను తయారు చేయడంతో పాటుగా తమ అత్యాధునిక సమగ్రమైన పరిశోధన మరియు తయారీ కార్యకలాపాలను ఎఫ్‌డీఎఫ్ (ఫినీష్డ్ డోసేజ్ ఫార్మ్)లో ఫెవిపిరవర్ 200ఎంజీ ట్యాబ్లెట్లను తయారుచేయడానికి వినియోగించనుందని తెలిపారు.

ఫెవికోవిడ్ బ్రాండ్

ఫెవికోవిడ్ బ్రాండ్

ఆప్టిమస్ ఫార్మా ఈ డ్రగ్‌ను ఫెవికోవిడ్ బ్రాండ్‌ పేరిట మార్కెట్ చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఆప్టిమస్ లైఫ్‌ సైన్సెస్‌ ప్రయివేట్ లిమిటెడ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ను ప్రత్యేకమైన సేల్స్ ఫోర్స్ ద్వారా మార్కెట్ చేయనుంది. దేశంలో వేగవంతంగా విస్తరిస్తున్న కరోనా యొక్క అత్యవసర పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వేగవంతమైన అనుమతుల ప్రక్రియలో భాగంగా ఫెవిపిరవిర్ 200ఎంజీ ట్యాబ్లెట్ల కోసం ఆప్టిమస్ ఫార్మాకు తయారీ మరియు మార్కెటింగ్ అనుమతులను డీసీజీఐ అందించింది. ఈ అనుమతులను పరిమిత ఉపయోగం కోసం మాత్రమే అందించారు. అందువల్ల ఈ ఔషదాన్ని వినియోగించే కరోనా పాజిటివ్ రోగులు తప్పనిసరిగా పూర్తి సమాచారయుక్తంగా తమ సమ్మతి పత్రాన్ని చికిత్సకు ముందు సమర్పించాల్సి ఉంటుందని ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది.

ప్రిస్కిప్షన్ ఆధారిత ఔషదం ఫెవికోవిడ్

ప్రిస్కిప్షన్ ఆధారిత ఔషదం ఫెవికోవిడ్

ఫెవికోవిడ్ ప్రిస్కిప్షన్ ఆధారిత ఔషధం. మొదటి రోజు రెండుసార్లు చొప్పున 1800ఎంజీ ఉపయోగించాలి. అనంతరం రోజుకు రెండుసార్లు 800ఎంజీ ట్యాబ్లెట్లను 14 రోజుల పాటు ఉపయోగించాలి. ఆప్టిమస్ ఫార్మా ఈ ట్యాబ్లెట్లను తెలంగాణాలోని హైదరాబాద్‌ వద్ద నున్న తమ యుఎస్ ఎఫ్డీఏ, డబ్ల్యుహెచ్‌ఓ-జీఎంపీ అనుమతించిన తయారీ కేంద్రంలో తయారు చేస్తుంది. ఈ ఔషదం అటు ఆసుపత్రితో పాటుగా ఇటు రిటైల్ మార్గాలలో కూడా లభిస్తుందని ఆప్టిమస్‌ తెలిపింది.

అందుబాటులో ధరలు..

అందుబాటులో ధరలు..

ఫెవిపిరవిర్‌ను వాస్తవంగా జపాన్‌లో 2014లో నోవెల్ లేదా రీఎమర్జింగ్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఇన్‌ఫెక్షన్స్ చికిత్స కోసం అనుమతించారు. ఇది వినూత్నంగా పనిచేసే యంత్రాంగం కలిగి ఉంది. ఇది చురుకైన ఫాస్ఫోరిబోసిలేటెడ్ ఫార్మ్ (ఫావిపిరావిర్ -ఆర్టీపీ)గా కణాలలో మారుతుంది. వైరల్‌ ఆర్ఎన్‌ఏ ఫాలిమిరాజ్ చేత సబ్‌స్ట్రాట్‌గా గుర్తించబడుతుంది. తద్వారా ఆర్ఎన్‌ఏ పాలిమిరాజ్ యాక్టివిటీని నిరోధిస్తుంది.

కరోనా కేసులు పెరుగుతున్నాయని, చికిత్సావకాశాలు తక్కువగా ఉన్న సమయంలో భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ నుండి సరైన సమయంలో అనుమతులను అందుకున్నామని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటు ధరల్లో అందించనుంది.

దేశీయ సరఫరాతో పాటుగా ఆప్టిమస్ ఇప్పటికే ఫెవిపిరవిర్‌ను అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తుంది. ఈ ట్యాబ్లెట్లను ప్రభుత్వ సంస్థల ద్వారా సరఫరా చేయడానికి సైతం ఉన్న అవకాశాలను వెదుకుతున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+