Kursi Bachao Budget: దేశం చాలా కాలంగా ఎదురుచూసిన రోజు వచ్చేసింది. అందరూ ఆసించిన బడ్జెట్ మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి రాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఏపీ, బిహార్ రాష్ట్రాలకు కేటాయింపులు చేయటంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
వాస్తవానికి మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటుకు కూటమిలోని సభ్యుల బలం కీలకంగా మారింది. ఈ క్రమంలో ఏపీలో కూటమితో కలిపి పోటీ చేసిన తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వంతో పాటు బీజేపీకి బిహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం అందించే ఎంపీల సపోర్ట్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల బడ్జెట్ ప్రకటనకు ముందే బిహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పిన కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపుతో దానిని సర్ధుబాటు చేసింది. ఈ సారి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ పూర్తిగా మోదీ తన కుర్చీని కాపాడుకునేందుకు వినియోగించుకున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తూ ఇది కుర్చీ కాపాడుకునేందుకు మోదీ చేసిన ప్లాన్ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో యూపీకి చెందిన అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ తమ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ పై తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లా ఉందని కేంద్ర బడ్జెట్ లాగా కనిపించలేదని అన్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నేటి బడ్జెట్ ప్రసంగంపై స్పందిస్తూ ఇది "ఆంధ్రా-బీహార్ బడ్జెట్!" అంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రెజెంటేషన్ బడ్జెట్ తర్వాత శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ నేటి బడ్జెట్ చూస్తుంటే 'పీఎం సర్కార్ బచావో యోజన'గా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేసిన చర్య అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన తర్వాత కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తమకు నిధులు ఇచ్చాయని కేంద్రం విస్మరించిందని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications