న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈశాన్యం, కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే- అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ మెట్రో రైళ్ల వ్యవస్థ విస్తరించింది. దేశ రాజధానికి మెట్రో రైళ్లు గుండెకాయగా మారాయి. ఢిల్లీ ప్రభుత్వం మెట్రో రైళ్ల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. నజఫ్‌గఢ్ నుంచి దౌసా బస్టాండ్ వరకు నిర్మించిన మెట్రో రైల్వే ప్రాజెక్టు ఇవ్వాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ- ఈ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. గ్రే లైన్ పరిధిలోకి వస్తుందీ ప్రాజెక్ట్.

కొత్తగా 900 కిలోమీటర్లు..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హర్దీప్ సింగ్ పురీ జెండా ఊపి.. తొలి మెట్రో రైలును ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. కాగా- వచ్చే సంవత్సరం అంటే 2022 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 900 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను వేర్వేరు రాష్ట్రాలకు మంజూరు చేసినట్లు హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. అలాగే- 740 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.

నగరాల అభివృద్ధికి..
ఈ 740 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేర్వేరు నగరాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవన్నీ అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మంజూరు చేయబోయే 900 కిలోమీటర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే- మొత్తంగా 2000 కిలోమీటర్ల మేర మెట్రో రైల్వే విస్తరణ చేపట్టినట్టవుతుందని హర్దీప్ సింగ్ పురీ చెప్పారు. నగరాలను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు.

ప్రతి సంవత్సం కొత్త ప్రాజెక్టులు..
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు, నగరాలు, మహా నగరాలకు తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని చెప్పారు. అలాగే- మెట్రో నగరాల్లో ప్రధానమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అన్నారు. వాహనదారుల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, సకాలంలో రాకపోకలు సాగించడానికి మెట్రో రైల్వేను మరింత విస్తరిస్తామని హర్దీప్ సింగ్ పురీ చెప్పారు. ప్రతి సంవత్సరం కొత్త మెట్రో రైల్వే ప్రాజెక్టులను అవసరమైన రాష్ట్రాలకు మంజూరు చేస్తామని అన్నారు.

ఏపీలో తప్ప..
కాగా- దేశంలో అన్ని ప్రధాన రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల రాజధానులైన బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), హైదరాబాద్ (తెలంగాణ), తిరువనంతపురం (కేరళ)లకు కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టులను మంజూరు చేసింది. అవన్నీ కార్యరూపంలోకి వచ్చాయి. ఆయా నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దక్షిణాదిన ఒక్క ఏపీలో మాత్రమే మెట్రో రైళ్లు అందుబాటులో లేవు.

టీడీపీ బాటలోనే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఇదివరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్‌కు మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. విభజన అనంతరం 13 జిల్లాలతో ఆవిర్భవించిన ఏపీకి మాత్రం ఇప్పటిదాకా మెట్రో రైల్ రాలేదు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ.. ఈ విషయంలో ఘోరంగా విఫలమైనట్టే. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్నా మెట్రో రైల్ ప్రాజెక్టును తీసుకుని రాలేకపోయిందనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టనట్టే కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications