OpenAIకి చెందిన ప్రముఖ AI చాట్‌బాట్ ChatGPT ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటోంది. దింతో కస్టమర్లు AI చాట్‌బాట్ ఉపయోగించలేకపోతున్నారు. డౌన్‌డెటెక్టర్ (Downdetector) నివేదిక ప్రకారం, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సమస్య మొదలైంది, అలాగే చాలా మంది యూజర్లు దీనిపై ఫిర్యాదు చేశారు.
సమస్య వివరాలు చూస్తే
ఫిర్యాదుల పెరుగుదల: మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో ఫిర్యాదులు రావడం ప్రారంభమయ్యాయి ఇంకా మధ్యాహం 3:02 గంటలకు ఫిర్యాదుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఫిర్యాదుల క్యాటగిరి : 93% ఫిర్యాదులు నేరుగా ChatGPTకి సంబంధించినవి. అందులో 7% ఫిర్యాదులు OpenAI యాప్ గురించి ఇంకా 1% లాగిన్ సమస్యల గురించి వచ్చాయి.
యూజర్ల రిపోర్టు: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో (గతంలో ట్విట్టర్) యూజర్లు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసారు. ఈ స్క్రీన్‌షాట్‌లలో ఖాళీ చాట్ విండోలు, పూర్తిగా లేని సమాధానాలు, సర్వర్ లోపాలు (server errors) ఇంకా లోడ్ చేయడంలో సమస్యలు (loading issues) కనిపిస్తున్నాయి.

లాగిన్ సమస్యలు: చాలా మంది యూజర్లు తాము లాగ్ అవుట్ అయ్యామని లేదా లాగిన్ అవ్వడానికి పదేపదే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది వాడే సమయంలో చాట్‌బాట్ పనిచేయడం ఆగిపోయిందని, ఇంకా తమ పనికి అంతరాయం కలిగిందని కూడా పేర్కొన్నారు.
OpenAI స్పందన:
OpenAI ఈ సమస్యకు కారణాలను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, వారి సర్వీస్ స్టేటస్ పేజీలో (Service Status Page), "కొంతమంది యూజర్లు సర్వీసెస్లో లోపాలు ఇంకా జాప్యాలను ఎదుర్కొంటున్నారు. మేము దీనిని పరిశీలిస్తున్నాము" అని పేర్కొన్నారు. ఉచిత ఇంకా ChatGPT ప్లస్ యూజర్లు అందరికీ ఈ సమస్య ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది.
సమస్యకు కారణం ఇంకా అంచనాలు:
ఎర్రర్ రిపోర్టులో అకస్మాత్తుగా పెరిగిన సంఖ్యను బట్టి చూస్తే, ఇది సర్వర్‌లో సమస్య లేదా సర్వర్‌పై అధిక లోడ్ (heavy load) కారణంగా జరిగి ఉండవచ్చు. అయితే, OpenAI దీనిని ఇంకా వెరిఫై చేయలేదు. టెక్నీకాల్ టీం ఈ సమస్యను పరిశీలిస్తోందని, త్వరలోనే పరిష్కరిస్తామని భావిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సమస్యలు కొన్ని గంటల్లోనే పరిష్కరించబడేవి.
గతంలో ChatGPT ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది, దీని వల్ల యూజర్లు యాప్ అండ్ వెబ్‌సైట్ ద్వారా AI చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, 22,000 మంది యూజర్లు OpenAI Sora అండ్ ChatGPT API లలో సమస్యలను నివేదించారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఈ అంతరాయాన్ని నివేదించారు.


Click it and Unblock the Notifications